గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే… వంటనూనె ఎంపికలో జాగ్రత్తలు అవసరమా?

జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా రోజూ ఉపయోగించే వంటనూనెలు గుండె జబ్బులకు కారణమవుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారాల్లో వంటనూనెల వినియోగం అన్నది ప్రస్తుతం కీలక అంశంగా మారింది. నిపుణుల సూచనల ప్రకారం సరైన నూనె ఎంపికతో గుండె సంబంధిత సమస్యలను చాలా వరకు నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

గుండెకు మేలు చేసే వంటనూనెలు;

వైద్య నిపుణుల సూచనల ప్రకారం అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే నూనెలు గుండె ఆరోగ్యానికి మంచివి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆలివ్ ఆయిల్ (Olive Oil) ; ఇందులో మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచడంలో ఇది సహకరిస్తుంది.

వేరుశనగ నూనె ; భారతీయ వంటలకు అనుకూలమైన ఈ నూనె గుండెకు హానికరమైన కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది.

సన్‌ఫ్లవర్ ఆయిల్ ; పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగిన ఈ నూనె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని అడ్డుకుంటుంది.

రైస్ బ్రాన్ ఆయిల్ ; కొలెస్ట్రాల్ నియంత్రణలో ఇది మంచి ఫలితాలు ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

నువ్వుల నూనె ; యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటంతో గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

ఏ నూనెలకు దూరంగా ఉండాలి?

డాల్డా, వనస్పతి, ట్రాన్స్ ఫ్యాట్ కలిగిన నూనెలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. గుండెపోటు ముప్పును అధికం చేస్తాయి.

నిపుణుల సూచనలు ;

ఒకే రకమైన నూనెనే కాకుండా రెండు లేదా మూడు రకాల నూనెలను మారుస్తూ ఉపయోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

నూనె ఉపయోగించే పరిమాణం కూడా ముఖ్యమే. ఎంత మంచి నూనె అయినా అధికంగా వాడితే హానికరమే.

వేయించిన ఆహారానికి బదులు ఉడికించిన, ఆవిరి పై వండిన ఆహారాన్ని ప్రాధాన్యం ఇవ్వాలి.

గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే వ్యాయామంతో పాటు రోజూ వాడే వంటనూనెలపై సరైన అవగాహన ఉండటం తప్పనిసరి. చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

×