గర్భంతో ఉన్న మహిళలు రోజుకు ఎంత ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి?

Folic Acid and Pregnancy: గర్భంతోఉన్న మహిళలు ఫోలిక్ యాసిడ్ (Folic Acid) సప్లిమెంట్లు తీసుకోవటం ద్వారా పుట్టుబోయే బిడ్డకు పుట్టుకతో వచ్చే గుండె లోపాల ప్రమాదాన్ని నివారించవచ్చు. పెదవి,అంగిలి చిలి ఉండే గ్రహణమోర్రి వంటి సమస్యలను నివారించవచ్చు. వైద్యులు రోజుకు 600ఎంసిజీ మోతాదు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే మనం రోజువారిగా తీసుకునే చాలా ఆహారాలలో ఫోలిక్ యాసిడ్ సహజంగానే లభిస్తుంది.

ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్ల రూపంలో, రోజువారిగా తీసుకునే బలమైన ఆహారాలలో కనిపించే B విటమిన్. ఫోలేట్ యొక్క సింథటిక్ రూపాన్నే ఫోలిక్ యాడిగ్ పిలుస్తాము. ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను తయారు చేయడానికి, DNA ను ఉత్పత్తి చేయడానికి ఉపకరిస్తుంది. గర్భధారణకు ముందు, గర్భధారణ( Pregnancy) తరువాత ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది. గర్భంలో శిశువు అవయవాలు సక్రమంగా అభివృద్ధి చెందేందుకు ఇది చాలా ముఖ్యం. గర్భధారణకు ముందు ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ద్వారా సహా జనన లోపాలను నివారించడంలో తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు?

ప్రతి ఏడాది యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 3,000 మంది పిల్లలు వివిధ లోపాలతో పుడుతున్నారు. వాటిలో నరాల సంబంధిత లోపాలతో పుట్టేవారే అధికంగా ఉంటున్నారు. ఇలా పుట్టిన పిల్లలకు అనేక రకాల శస్త్రచికిత్సలు అవసరమౌతున్నాయి. కొందరు పిల్లలు పక్షవాతం వంటి దీర్ఘకాలిక వైకల్యాన్ని ఎదుర్కొంటున్నారు.

2015 అధ్యయనాల ప్రకారం, గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ (folic acid supplements) ఇవ్వటం వల్ల పుట్టుకతో వచ్చే గుండె లోపాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, శిశువు తల్లిగర్భంలో ఉన్న సమయంలోనే గుండె , రక్త నాళాలు సాధారణంగా పెరగని సందర్భంలో బిడ్డ పుట్టిన తరువాత పుట్టుకతోనే వారిలో గుండె లోపాలు ఏర్పడతాయి. గుండె లోపలి గోడలు, గుండె కవాటాలు, గుండె యొక్క ధమనులు సిరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

పరిశోధనలు చెబుతున్న ప్రకారం గర్భధారణ తొలిదశలోనే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు గ్రహణమొర్రి వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. గర్భం దాల్చిన మొదటి 6 నుండి 10 వారాలలో నోరు, పెదవి భాగాలు సరిగ్గా లేకపోతే పుట్టుకతో లోపాలు కనిపిస్తాయి. లోపాలను సరిచేసేందుకు బిడ్డ పుట్టిన తరువాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.

ఫోలిక్ యాసిడ్ ఎంత అవసరం?

గైనకాలజీ వైద్యుల సూచన ప్రకారం గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ కనీసం 600 మైక్రోగ్రాముల (mcg) ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ప్రినేటల్ విటమిన్లలో ఈమోతాదుతో కూడిన ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. గర్భవతి తెలిసిన తరువాత ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ప్రారంభించాలి. చాలా మంది మహిళలకు గర్భం దాల్చిన 6 వారాలు, అంతకంటే ఎక్కువ వారాల వరకు తాము గర్భవతి అని కూడా తెలియదు. పుట్టబోయే బిడ్డలో నరాల సంబంధింత లోపాలను నివారించడానికి శరీరంలో తగినంత ఫోలిక్ యాసిడ్ ఉందని నిర్ధారించుకోవాలి. గర్భం దాల్చాలని ప్లాన్ చేసేవారు, ప్రసవానికి సిద్ధంగా ఉన్న మహిళలు ప్రతిరోజూ 400 mcg ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి.

నరాల సంబంధిత లోపాలు కలిగిన బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు తరువాత గర్భధారణకు ముందునుండే ఎక్కువ మోతాదులో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సి అవసరం ఉంది. వైద్యులను సంప్రదించి వారి ఇచ్చే సూచన మేరకు ఫోలిక్ యాసిడ్స్ సంప్లిమెంట్స్ తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్ ఎక్కువ మోతాదు ఎవరికి ఎక్కువ అవసరం:

1.మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి
2.సికిల్ సెల్ వ్యాధి ఉన్నవారికి
3.కాలేయ వ్యాధితో బాధపడుతున్నవారికి
4.ఆల్కహాల్ ను రోజువారిగా తీసుకోవాల్సిన మోతాదుకంటే ఎక్కువగా సేవించేవారికి
5.మూర్ఛలు, టైప్ 2 డయాబెటిస్, సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఉబ్బసం, వంటి వ్యాధులకు చికిత్స పొందుతున్న వారికి

×