అన్నం తింటే షుగర్ వస్తుందా ? అసలు వాస్తవం ఏంటి ?

rice cause sugar : షుగర్ వ్యాధినే డయాబెటిస్‌, మధుమేహం(diabetes)అని అంటారు. రక్తంలోని గ్లూకోజ్ ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు మధుమేహం వస్తుంది. డయాబెటిస్ ఒకసారి వస్తే జీవితం మొత్తం వేధించే తీవ్రమైన అనారోగ్య సమస్య. ఎవరికైనా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. మనం తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లను జీర్ణవ్యవస్థ గ్లూకోజ్ గా విడగొట్టింది. క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్, శక్తిని విడుదల చేసేందుకు ఈ గ్లూకోజ్‌ను(Glucose) తీసుకోవాలని శరీర కణాలకు సిగ్నల్స్ ఇస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగినప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి ఆగినప్పుడు శరీరంలో చక్కెర పెరిగి డయాబెటిస్ వస్తుంది.

డయాబెటిస్ రావటానికి అన్నం తినటానికి లింకేంటి :

అన్నం ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలా మంది సందేహంలో ఉంటారు. అన్నం ఎక్కువగా తింటే షుగర్ వస్తుందని చాలా మంది భయపడుతున్నారు. ఇప్పటికే షుగర్ వ్యాధి ఉన్నవారు అన్నం తినేందకు వెనుకాముందాడుతున్నారు. వరి అన్నం తింటే షుగర్ వస్తుందన్న కారణంతో చాలామంది క్రమంగా అన్నం తినటం మానేస్తున్నారు. రోజులో నాలుగు సార్లు అన్నం ఎక్కువగా తినే వ్యక్తుల్లో మధుమేహం వచ్చే అవకాశం 1.5 రెట్లు ఎక్కువని పలు అధ్యయనాల్లో తేలింది. వివిధ రకాల బియ్యాలను బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ లో మార్పులు ఉంటాయి. ముడిబియ్యం కన్నా బాగా పాలీష్ పట్టిన తెల్లబియ్యం ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. బ్రౌన్ రైస్ లో అధిక పీచు, పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్(Glycemic index) తక్కువ విలువ ఉంటుంది.

నిపుణులు ఏం చెబుతున్నారు ;

అన్నం తినటం పూర్తిగా మానేయడం కంటే, సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి అన్నం తినడం ఒక్కటే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో శారీరక శ్రమ తగ్గిపోవటం, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు షుగర్ తోపాటు ఇతరత్రా ఆరోగ్యసమస్యలకు కారణమౌతున్నాయని నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకునే విషయంలో సమయ వేళలు పాటించపోవటం, రాత్రి మరీ ఆలస్యంగా తినటం, త్వరగా ముగించాలని వేగంగా తినటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. రోజంతా కూర్చుని పనిచేయడం, శారీరకంగా యాక్టివ్ గా లేకపోవటం, అధిక బరువు డయాబెటీస్ కు కారణాలని పలు అధ్యయనాల్లో తేలింది.

×