గుడ్లు తింటే గుండె జబ్బు ముప్పు తప్పదా ?

Eggs and heart disease : గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. గుడ్లలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందనేది వాస్తవం. ఉడికించిన ఒక పెద్ద సైజు గుడ్డులో 186 మి.గ్రా కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ శరీరంలోని రక్తం కొలెస్ట్రాల్ పై పెద్దగా ప్రభావాన్ని చూపదనే చెప్పాలి.

గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని కలిగించదని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు తినటం వల్ల కొలెస్ట్రాల్ తోపాటు చెడు కొలెస్ట్రాల్ గా చెప్పబడే ఎల్ డీఎల్ స్ధాయిలు పెరగవు. వాస్తవానికి ఉడికించిన గుడ్డు తినటం వల్ల మంచి కొలెస్ట్రాల్ అయిన ఎల్ డిఎల్ స్ధాయిలు పెరుగుతాయి.

శరీరకండరాలు, కణజాలాల తయారీకి, రిపేర్‌ చేసేందుకు ప్రోటీన్ అవసరత ఎక్కువ. గుడ్డులో శరీరం సొంతంగా తయారు చేసుకోలేని అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె కండరాలు బలంగా తయారవుతాయి.

ఉడికించిన గుడ్డు రోజుకు ఒకటి లేదా రెండు తింటే గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. గుడ్డులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. చైనాలో గుడ్డుపై జరిపిన పరిశోధనలో దాదాపు అర మిలియన్ల మంది పెద్దలకు ప్రతిరోజూ రోజుకు ఒక గుడ్డు తినిపించారు. అయితే వారిలో గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని కనుగొన్నారు.

గమనిక ; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.

×