రైతులకు గుడ్ న్యూస్..త్వరలో అన్నదాత సుఖీభవ డబ్బు

Annadata Sukhibava Update : ఏపి లో ఖరీఫ్ సీజన్‌ ప్రారంభమైంది. ఒకవైపు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అన్నదాతలు ఈపాటికే నారుమళ్లు వేసుకున్నారు. ఇప్పుడు రైతులకు పొలం ఖర్చులకు బాగా డబ్బు అవసరమౌతుంది. ప్రతి ఏటా ప్రభుత్వం రైతులకు పంట ఖర్చుల నిమిత్తం డబ్బు వేస్తుంది. గత సంవత్సరం కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు వేయలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన మొత్తం మాత్రం రైతులకు అందింది. అయితే ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో డబ్బులు ఇస్తామని చెబుతుంది. దీనిపై సీఎం చంద్రబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పధకం వర్తించాలంటే రైతులకు ఏయే అర్హతలు ఉండాలి అనే విషయాన్ని రైతులకు తెలియజేయాలని అధికారులకు ముఖ్యమంత్రి అదేశాలిచ్చారు. రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చారు.

రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి తమ పేరును చేర్చారో లేదో తెలుసుకోవాలి. అక్కడ నోటీస్ బోర్డులు వేశారు. లబ్దిదారుల పేర్లను ప్రదర్శనగా పెట్టారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in లో అర్హుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వివరాలు వస్తాయి. అలాగే మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. మొబైల్‌లో ఈ సైట్ ఓపెన్ చేసి, యాప్‌ని క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అవుతుంది. ఇలా కూడా లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

ఫోన్ ద్వారా పథకానికి ఉండాల్సిన అర్హతలను తెలుసుకునేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 155251 తెచ్చింది. దీనికి కాల్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు. దీంతోపాటు మన మిత్ర వాట్సాప్ ద్వారా రైతులు వివరాలు పొందవచ్చు. ఆధార్ నెంబర్‌ని మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009కి పంపితే అర్హతా వివరాలు వస్తాయి.

ఒకవేళ లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోయితే రైతు సేవా కేంద్రాలలోని వ్యవసాయ సహాయకులకు ఫిర్యాదు చేయ్యెచ్చు. రైతులు జులై 23 వరకు ఇలా అర్హులైన వారు పేరును నమోదు చేయించుకోవచ్చు. సోమవారం, మంగళవారం, బుధవారం లోపు ఈ పని పూర్తి చేయాలి.

డబ్బులు ఎంకౌంట్లలో పడేది ఎప్పుడంటే?

కేంద్రం ఎప్పుడు పీఎం కిసాన్ డబ్బువేస్తే అప్పుడే తాము కూడా అన్నదాత సుఖీభవ డబ్బు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. కేంద్రం అమలుచేస్తున్న పీఎం కిసాన్‌తో అన్నదాత సుఖీభవ పధకానికి సంబంధం ఉంది. సాధారణంగా ఏటా కేంద్రం ప్రభుత్వం ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో రూ.2000 చొప్పున 3 విడతల్లో డబ్బు ఖాతాల్లో వేస్తుంది. ఈసారి జూన్ పోయి జులై వచ్చేసింది. అయితే దేశవ్యాప్తంగా అర్హులు కాని రైతుల పేర్లను తొలగించే పని జరగటం వల్ల కొంత జాప్యం జరిగింది. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో డబ్బును అకౌంట్లలో జమ చేసే అవకాశం ఉందని సమాచారం.

×