
healthy juice for heart : ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఇందుకు చిన్నారుల నుండి వృద్ధుల వరకు గుండె జబ్బుల కారణంగా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. పైకి ఆరోగ్యంగానే కనిపించినా అకస్మాత్తుగా గుండె సంబంధిత సమస్యలు ప్రాణాలు తీసేస్తున్నాయి. వీటన్నింటికి కారణం ఆరోగ్య అలవాట్లు…రూజువారి జీవన విధానమే. ఆరోగ్యం పట్ల ఇటీవలి కాలంలో సరైన శ్రద్ధ చాలా మందిలో లోపించింది. అందువల్లే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రోజు వారి జీవితంలో గుండె ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుండె ఆరోగ్యం మెరుగుకోసం , గుండె సంబంధిత సమస్యలు భవిష్యత్తులో ఎదురు కాకుండా ఉండేందుకు సరైన ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుండె ఆరోగ్యం కోసం బీట్ రూట్ జ్యూస్ ఎంతగానో ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీట్ రూట్ జ్యూస్ వల్ల కలిగే ఉపయోగాలేంటో ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
బీట్ రూట్ జ్యూస్ తో గుండె కు కలిగే మేలు ;
బీట్ రూట్ జ్యూస్ గుండె పని తీరు మెరుగుపరచటంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిస్తుందని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోదనలో తేల్చారు. 70 ఏళ్ల వయసు వారిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది.
దీనిని సేవించటం వల్ల బీపీ సాధారణ స్థితిలో ఉంటుంది. నైట్రేట్స్ కల్గిన ఈ జ్యూస్ యువకులకు ఎన్నో లాభాలు కలగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. నోటిలో, కడుపులో మంచి బ్యాక్టీరియా పెంచటంలో దోహదం చేస్తుంది. ఇందులోని నైట్రేట్స్ కడుపులోకి చేరిన వెంటనే నైట్రిక్ ఆక్సైడ్‌గా మారిపోయి రక్త నాళాలను సడలింపు చేస్తాయట. తద్వారా హై బీపీతో తగ్గి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందని చెప్తున్నారు.
అధిక రక్తపోటు గుండె సమస్యలకు ప్రధాన కారణాలలో ఒకటి. ఈ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, బీటాలైన్‌లు రక్తనాళాలలో వచ్చే వాపును తగ్గించటంలో సహాయపడతాయి. గుండెకు రక్త సరఫరా మెరుగుపడేలా చేస్తుంది. ముట్లుడిగిపోయిన మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచటం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరానికి శక్తినిస్తుంది. శరీరంలో పేరుకు పోయిన విషపదార్థాలను బయటకు పంపటంలో సహాయపడటం ద్వారా లివర్ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో భాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.