మద్యం కుంభకోణం బిగ్ బాస్ అతడే

Andhra Pradesh Liquor Scam : గత వైసీపీ ప్రభుత్వం ఏలుబడిలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోచుకున్నది ఆనాటి సియం జగనని తేలిపోయింది. సిట్ దర్యాప్తులో అనేక ఆసక్తి కర విషయాలు వెలుగు చూశాయి. మద్యం సప్లై చేసిన కంపెనీలు, డిస్టలరీల నుండి ముడుపుల రూపంలో పెద్ద మొత్తంలో సొమ్మును వసూలు చేసి జగన్ కు చేరవేసినట్లు స్పష్టమైంది.

వసూళ్ళ మొత్తం జగన్ కు చేరిందిలా ;

ఈ కేసులో ప్రధాన నిందితుడు గా ఉన్న రాజ్ కసిరెడ్డి నెలవారీగా 50 నుండి 60 కోట్ల సొమ్మును వైసీపీ ఎంపి మిధున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్ సతీమణి భారతి ఆర్ధిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి అందజేసేవారు. ఆతరువాత ఆసొమ్మును జగన్ కు చేర్చినట్లు నిర్ధారణైంది. సుమారుగా 3500 కోట్ల సొమ్మును మద్యం కుంబకోణం ద్వారా లబ్ధి పొందినట్లు తేలింది. జగన్ కు లబ్ధి చేసేందుకే ఈ కుంభకోణానికి తెరతీసినట్లు స్పష్టత వచ్చింది.

లిక్కర్ స్కామ్ లో మాస్టర్ బ్రెయిన్ ;

2019 ఎన్నికలకు ముందు దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానంటూ జగన్ ప్రగల్భాలు పలికారు. అయితే ఇచ్చిన హామీ మాట ఏమోకాని, ఏకంగా మద్యంలో భారీ కుంభకోణానికి తెరతీశారు. సిట్ దర్యాప్తు వివరాల ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను ఏపి మద్యం స్కామ్ మించి పోయింది. మద్యం నిషేధం ముసుగులో అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమ సంపాదనకు తెరతీసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

మూడు దశల్లో మద్యం స్కామ్

సర్కారు గుత్తాధిపత్యం: జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేశారు. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కిందకు తీసుకువచ్చారు. అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా అమ్మకాలను నియంత్రించి మొత్తం మద్యం సరఫరా వ్యవస్ధపై పూర్ధిస్తాయి ఆధిపత్యం సాధించారు.

జె బ్రాండ్లుతో రంగంలోకి : మద్యం సరఫరా వ్యవస్ధ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చిన వెంటనే ఎన్నో ఏళ్ళుగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను నిలిపివేశారు. వాటి స్థానంలో, జగన్ ముందుగా తన అనుచరుల చేత సిద్ధం చేసుకున్న మాయకంపెనీల మద్యం బ్రాండ్లతో మార్కెట్‌ను ముంచెత్తించారు. గతంలో ప్రముఖ బ్రాండ్ల మార్కెట్ వాటా 53% ఉండేది. అయితే జె బ్రాండ్ల రాకతో అదికాస్త 5.3%కి పడిపోయింది. మందు బాబులకు మార్కెట్లో మంచి బ్రాండ్ మద్యం అందుబాటులో లేకపోవటంతో చేసేది లేక జగన్ గారి జె బ్రాండ్ల నే కొనాల్సిన దుస్ధితి ఏర్పడింది.

పారదర్శకత లోపం : మద్యం కుంబకోణంలో మరో కొత్తం అంశం ఏమిటంటే గతంలో ఉన్న పారదర్శకమైన, ఆటోమేటెడ్ ఆన్‌లైన్ స్టాక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను రద్దు చేశారు. దాని స్థానంలో మాన్యువల్ ఆఫర్ ఫర్ సేల్ను ప్రవేశపెట్టారు. ఈ విధానంతో తమ సొంత అనుచరుల డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు.

కిక్ బ్యాక్ ల పేరుతో వేల కోట్ల అక్రమంగా సంపాదన ;

తమ అనుచరుల డిస్టిలరీల నుంచి సప్లై అయిన ప్రతి మద్యం కేసుకు 150 నుంచి 600 వరకు లంచంగా (దానినే మనం కిక్‌బ్యాక్‌గా అంటున్నాం)వసూలు చేసినట్లు సిట్ నిర్ధారించింది. ఐదేళ్లలో సుమారు 3,200 కోట్లు వసూలు చేసినట్లు లెక్కలు తేల్చారు. జగన్ తెచ్చిన మద్యం నూతన పాలసీ ద్వారా సర్కారు ఖజానాకు18 వేల కోట్ల రూపాయలకు గండిపడింది.

పుచ్చుకున్న నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా డిజిటల్ చెల్లింపులను నిషేధించారు. కేవలం నగదు లావాదేవీలనే కొనసాగించారు. ఐదేళ్లలో జరిగిన 99,413 కోట్ల అమ్మకాల్లో 99.38% నగదు రూపంలోనే కొనసాగాయి. అసలు లెక్కల్లో లేని నగదును పక్కదారి పట్టించడానికి ఇక్కడే అసలు బీజం పడింది.

వసూలు చేసిన నల్లధనాన్ని హవాలా మార్గాల్లో దుబాయ్‌కు తరలించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ,ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్” అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాల్లోకి మళ్లించాటం ద్వారా తిరిగి దానిని వైట్ గా మార్చారని సిట్ నిర్దారించింది. ఇతంతా ఒక ఎత్తైతే భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, APSBCL ద్వారా అధిక వడ్డీకి వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించారు.

ఈ స్కామ్ కేవలం ఆర్థిక నేరమే కాదు, జె-బ్రాండ్లతో ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదనడానికి అకారణమయ్యారు.

×