5 రోజులు అంధ్రాలో…వీకెండ్ కు హైదరాబాద్ లో..అనుభవించు రాజా !

Andhra leaders weekend in Hyderabad : ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలకు శని , అదివారాల్లో ఇక్కడ ఉండబుద్ది కావటం లేదు. అంతా శుక్రవారం సాయంత్రం హైదరాబాదు బాటపడుతున్నారు. రెండు రోజుల పాటు వేషాలు మార్చి క్లబ్ లు, పబ్ ల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాపార వ్యహారాల్లో మరి కొందరు బిజీగా మునిగి తేలుతున్నారు.

రాష్ట్ర విభజన తరువాత తెలుగు వారికి అతిపెద్ద మెట్రోనగరం హైదరాబాద్. నూతన రాజధాని అమరావతిలో హైద్రాబాద్ వంటి కల్చర్ ఇంకా రాలేదు. హైద్రాబాద్ లో సకల సౌకర్యాలు ఉండటంతో ఏపిలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం వీకెండ్ వస్తే చాలు వారంతా హైద్రాబాద్ లో రెక్కలు కట్టుకుని వాలి పోతున్నారు.

ఏపిలో సెక్రెటేరియట్ కు 5 రోజులే పనిదినాలు కావటంతో సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే ఏపిలో గడుపుతున్నారు. శని, అదివారం వస్తే చాలు శుక్రవారం సాయంత్రమే హైద్రబాద్ లో వాలిపోతున్నారు. రెండు రోజుల పాటు ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. హైద్రబాద్ ఏపిలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు వీకెండ్ స్పాట్ గా మారిపోయింది. అక్కడైతే ఇష్టం వచ్చినట్లు , నచ్చినట్లు గడిపేందుకు అవకాశం ఉంటుంది. అందుకే హైద్రబాద్ అంటే చెవికోసుకుంటున్నారు.

ఏపికి చెందిన ఒకరిద్దరు మంత్రుల వ్యవహారం ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీకెండ్ వచ్చిందంటే చాలు వారు హైద్రబాద్ చేరుకుని పేకాటలో బిజీ బిజీగా గడుపుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఓ మంత్రి గారు ఏకంగా గన్ మెన్ల ను కూడా వదిలేసి ఆయన గారు రాచకార్యాలు చక్కబెట్టేస్తున్నారు. ఏకంగా గెస్ట్ హౌస్ లో గానభజానా కార్యక్రమాలతో ఏంజాయ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతని వ్యవహార శైలిపై కొంత కాలం క్రితం ఓ ప్రధాన తెలుగు దిన పత్రిక బ్యానర్ ఐటం పెట్టి మరి వాయించేసింది. అయినా ఆయన గారి వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పులేదన్న వాదన వినిపిస్తుంది.

ఇక ఎమ్మెల్యేల గురించి చెప్పాల్సిన పనిలేదు. నియోజకవర్గాలను గాలికొదిలేసి మరి హైద్రాబాద్ లోనే ఎక్కవ రోజులు గడుపుతున్నారు. రియలెస్టేట్, వ్యాపార వ్యవహారాల్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. చాలా మంది నిర్మాణ రంగంలో తమ కార్యకలాపాలన్నీ హైద్రబాద్ లోనే ఉండటంతో ఆ వ్యవహారాలు చక్కదిద్దుకునే పనిలో పడుతున్నారు. ఓట్లేసిన ప్రజలను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.

ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజాప్రతినిధులకు అదేశాలిస్తుంటే వారు మాత్రం తమకు ఇవేమి పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార కూటమి ప్రజాప్రతినిధుల పరిస్ధితి ఇలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేల పరిస్ధితి అలాగే ఉందన్న చర్చ జరుగుతుంది. చాలా మంది ప్రజా ప్రతినిధులు శని, ఆదివారాలు హైద్రాబాద్ చెక్కెస్తూ ఏపిని,.. ఓట్లేసిన ప్రజలను పట్టించకోకపోవటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

×