
Avocado for heart health : అవకాడోను తెలుగులో వెన్న పండు అంటారు. ఆరోగ్యానికి అవకాడో ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. చిన్న సైజు పిందె నుండి పండుగా మారేందుకు ఆరు నుంచి తొమ్మిది నెలలు కాలం పడుతుంది. ఈ పండులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలం.
అవకాడో గుజ్జులో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్,కె, ఎ, బి2, బి3, బి5, బి6, సి, బి, విటమిన్లు ఉన్నాయి. పొటాషియం, ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలు పుష్కలమనే చెప్పాలి. హార్మోన్ల సమతౌల్యానికి, మెనోపాజ్, పీసీఓడీ (PCOD), సమస్యల నివారణకీ, సంతానోత్పత్తికీ గర్భిణుల ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.
అవకాడోలో ఉండే బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడి కంటిచూపుని మెరుగుపరుస్తుంది. దీనిలోని పొటాషియం రక్తనాళాల సంకోచాన్ని తగ్గించి రక్తనాళాలను విస్తరింపు చేస్తుంది. వేసవిలో సాధారణంగా చాలా మందిలో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు అవకాడో తింటే బీపి కంట్రోల్ అవుతుంది. అవకాడోని స్మూతీ, సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.
అవకాడోలోని ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాని మంచి చేస్తాయి. రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరం. దీనిలోని ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఆకలి లేకుండా చేసి కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. దీంతో బరువు ఈజీ తగ్గొచ్చు.
అవకాడోలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. అవకాడోలో సూక్ష్మ పోషకాలు ఉండటం వల్ల పేగుల ఆరోగ్యానికి అల్టిమేట్ గా జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపకరిస్తాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు అవకాడో పండుని తీసుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహా మంచి ఫ్యాటీ యాసిడ్స్ అవకాడోలో ఉన్నాయి.