టెన్నిస్ స్టారుగా రాధికా యాదవ్ ఎదుగుదల కథ ఇదే!

Radhika Yadav murder : హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన రాధికా యాదవ్ యువ టెన్నిస్ క్రీడాకారిణి. 23 మార్చి 2000న జన్మించిన ఆమె చిన్నతనం నుంచే టెన్నిస్ క్రీడ పట్ల ఆసక్తి కనబరిచేది. గ్రామ స్ధాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది మేటి టెన్నీస్ క్రీడాకారిణిగా ఖ్యాతి గాంచింది. ITF టెన్నిస్ టూర్‌లో పోటీపడిన ఉత్తమ మహిళా క్రీడాకారిణుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) ర్యాంకింగ్స్‌లో టాప్-100లో నిలిచిన క్రీడాకారిణుల్లో రాధికా యాదవ్ ఒకరు. ITF మహిళల డబుల్స్‌లో అత్యధికంగా 113వ స్థానాన్ని సాధించింది టెన్నీస్ క్రీడలో తనకంటూ ప్రత్యేకతను సాధించింది. హర్యానాలో డబుల్స్‌లో టాప్-5 క్రీడాకారిణులలో ఒకరిగా గుర్తింపు పొందింది. 2021 లో ఆమె టెన్నిస్ కోచ్‌గా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గురుగ్రామ్‌లో తన సొంతగా టెన్నిస్ అకాడమీని ప్రారంభించి, చిన్న పిల్లలకు శిక్షణ ఇస్తూ టెన్నీస్ క్రీడాకారులుగా తీర్చిద్దటంలో తన వంతు కృషి చేస్తుంది.

రాధికా యాదవ్ ఎలా హత్యకు గురైంది;

జూలై 10న మధ్యాహ్నం, గురుగ్రామ్‌లోని సుషాంత్ లోక్ ప్రాంతంలోని ఇంట్లో రాధికా తన తండ్రి దీపక్ యాదవ్ చేతిలో హత్యకు గురైంది. తుపాకితో కాల్చటంతో ఆమె గొంతు భాగంలోకి మూడు బుల్లెట్లు చొచ్చుకుని వెళ్ళాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. తొలుత శబ్దం విన్న తల్లి అది ప్రెషర్ కుక్కర్ పేలుడుగా భావించింది. ఆ తర్వాత కానీ రాధికా నేలపై రక్తపుమడుగులో కనిపించడంతో ఒక్కసారిగా ఆమె షాక్ గురైంది. తక్షణమే ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే రాధిక యాదవ్ మృతి చెందింది.

కన్న తండ్రి ఎందుకు ఇంత ఘాతుగాని తెగబడ్డాడు ;

సోషల్ మీడియా Instagram reels ద్వారా రాధిక బాహ్యప్రపంచంలో ఉండటం పట్ల తండ్రి దీపక్ యాదవ్ కు ఏమాత్రం ఇష్టంలేదు. పలు పర్యాయాలు దీనిపై తండ్రి అసహనం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు దర్యాప్తులో పలు అంశాలు వెలుగు చూశాయి. తండ్రి ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రం కావటం, కుమార్తె సంపాదనపై అధారపడి బ్రతుకుతున్నాన్న భావనవల్ల అతనిలో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె ఆర్థిక స్వాతంత్య్రం, ఆమె నిర్వహిస్తున్న టెన్నీస్ అకాడమీ పట్ల అతనికి ద్వేష భావం పెరిగిపోవటం కూడా హత్యకారణమని పోలీసులు దర్యాప్తులో నిగ్గుతేల్చారు.

నిందితుడు దీపక్ యాదవ్ అరెస్ట్ ;

కుమార్తెను కాల్చి చంపిన తండ్రి దీపక్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గురుగ్రామ్‌ సెక్టార్ 56 పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఘటన జరిగిన సమయంలో తల్లి కూడా అదే ఫ్లోర్‌లో ఉండటంతో పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు.

మరోవైపు ఈ హత్యపై క్రీడా సంఘాలు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇది మహిళల స్వాతంత్య్రం పట్ల సమాజంలో ఇంకా ఉన్న పాతతరం అభిప్రాయాలకు నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. రాధికా యాదవ్ టెన్నిస్ రంగంలోనే కాకుండా యువతకు ప్రేరణ ఇచ్చే ఒక ధైర్యవంతురాలిగా ఎదిగింది. అయితే కుటుంబ సభ్యుల దురభిప్రాయాలు, అసూయలు, పితృస్వామ్య భావజాలం ఆమె జీవితాన్ని,ఆశయాలను మధ్యలోనే చిదిమేశాయి. రాధికా యాదవ్ ఘటన మహిళల వ్యక్తిగత, ఆర్థిక స్వాతంత్య్రాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.

×