ఇన్‎కంట్యాక్స్ కొత్త రూల్స్..ఇది తప్పనిసరి!

New Income Tax 2025 New Rules : ఇన్‎కం ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా… అయితే ఓసారి కొత్త మారిన రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే మరి. ఆదాయపు పన్ను శాఖ ఈ ఏడాది నుండి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఇమెయిల్ ఐడీ లేంటే మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి OTP తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ఈ-ఫైలింగ్ చేస్తున్న వారి భద్రతను పెంచడం, సమాచార దుర్వినియోగాన్ని నివారించడానికి దీనిని తీసుకువచ్చారు. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల వివరాలను నిర్ధారించేందుకు మాత్రమే ఈ విధానం తీసుకువచ్చారు.

ఈ రూల్ ఇతరులు ఏవరైనా అనధికార మార్పులకు పాల్పడకుండా నిరోధించేందుకు రూపొందించారు. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీనివల్ల వాస్తవ ఖాతాదారుడు మాత్రమే వివరాలను మార్చుకునేందుకు వీలుంటుంది. అనుకోని సందర్భాల్లో ఖాతా హ్యాకింగ్ లేదా దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పన్నురిటర్న్స ఫైల్ చేయటం, రీఫండ్ ప్రక్రియను మరింత జాగ్రత్తగా చేసేందుకు ఈ కొత్త విధానాన్ని ఉపయోగపడనుంది.

కొత్త పాన్ కార్డ్ కావాలంటే ఆధార్ తప్పనిసరి..

జూలై 1, 2025 నుంచి కొత్త పాన్ కార్డ్ దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ తప్పనిసరి చేశారు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ OTP ఉంటేనే పాన్ కార్డు వస్తుంది. ఆధార్ లేకపోతే కొత్త పాన్ కార్డ్ జారీకాదు. గతంలో డేట్ ఆఫ్ బర్త్ లేదా, ఇతర గుర్తింపు కార్డులతో పాన్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ ఆప్షన్ తొలగించారు. ఇప్పటికే పాన్ కార్డ్ కలిగినవారు డిసెంబర్ 31, 2025 లోపు అధార్ తో లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి లేకుంటే, పాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతుంది. గడువు తరువాత లింక్ చేస్తే రూ. 1,000 జరిమానా విధిస్తారు.

×