ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీ తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరగడుపున టీ తాగటం వల్ల కలిగే నష్టాల గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరగడుపున టీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నా కొందరు అసలు పట్టించుకోవటంలేదు. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ తాగితే వచ్చే సమస్యలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

- టీలో ఉండే కెఫిన్ కడుపు లో వికారాన్ని కలగిస్తుంది. కొన్ని సందర్భాల్లో నొప్పికి దారితీస్తుంది. అలాగే ఆమ్లతను పెంచి దీని కారణంగా అజీర్ణం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుంది.
- ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే శరీరానికి అందాల్సిన పోషకాలు తగ్గుతాయి. దీనిలో ఉండే ఉండే కెఫిన్ ఆకలి కాకుండా చేయటంతోపాటు, పోషకాల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
- డీహైడ్రేషన్‌కు కూడా ఉదయం టీ తాగటమన్నది కారణమవుతుంది. టీని తరచుగా తీసుకోనేవారిలో మూత్రవిసర్జన పెరిగి నిర్జలీకరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి టీ ని ఎక్కువ సార్లు తీసుకవటాన్ని తగ్గించాలి.
- మన నాడీ వ్యవస్థపై టీ అన్నది చెడు ప్రభావాన్ని చూపించటంతోపాటుగా, మైగ్రేన్‌తో సహా నిద్రపట్టకుండా చేసేందుకు దారి తీస్తుంది. ప్రశాంతమైన నిద్రకు ఇది నిరోధిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు టీ తీసుకోకుండా ఉండటమే మంచిది.
5.శరీరానికి ఐరన్ కంటెంట్ అందుకునే సామర్థ్యం టీ ఎక్కువగా తాగేవారిలో తగ్గుతుంది. టీలో ఉండే కెఫిన్, టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచి అసిడిటీ సమస్యను సృష్టిస్తుంది.
- ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలిగి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఛాతీలో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
అందువల్ల, ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగటం మానేయాలి. అల్పాహారం తిన్న అరగంట తర్వాత టీ తాగడం మంచిది. టీ బదులుగా గోరువెచ్చని నీరు తాగడం మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక ; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య నిపుణుల సూచనలు సలహాలు పాటించటం మంచిది.