కౌన్ బనేగా కరోడ్ పతి తో…కోట్లు కొల్లగొడుతున్న అమితాబచ్చన్

Amitabh Bachchan income from KBC : ప్రజాదరణ పొందిన బాలివుడ్ నటుడు అమితాబచ్చన్. ఐదు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో ఆయన అనేక చిత్రాల్లో నటించారు. బచ్చన్ సినిమాల్లోకి1990లో ఎంటర్ అయ్యారు. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధముడు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం టీవీ షోలకు ఒక్కో ఎపిసోడ్ కి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ లో చర్చజరుగుతుంది. ఆ మధ్య అమితాబ్ సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావటం పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాడు.

అలాంటి సమయంలో కౌన్ బనేగా కరోడ్ పతి అనే టీవీ షో అమితాబ్ ని మళ్ళీ నిలబెట్టిందనే చెప్పాలి. అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి (KBC) షోకి హోస్ట్ గా పనిచేస్తున్నాడు. కౌన్ బనేగా కరోడ్ పతి షోతో అమితాబ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. డబ్బు కూడా బాగా సంపాదించేస్తున్నాడు. ఈ షో ప్రతి సీజన్ అమితాబ్ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 16 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలో 17వ సీజన్ రానుంది. హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి 17వ సీజన్ ఆగస్టు 11 నుంచి ప్రారంభంకానుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ లో ప్రసారం కాబోతుంది.

అయితే ప్రస్తుతం ఈ షోకి సంబంధించి ఒక్కో ఎపిసోడ్ కి అమితాబ్ తీసుకునే రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తి కరమైన చర్చనడుస్తుంది. అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వారానికి 5 ఎపిసోడ్స్ ఆయన చేస్తారు. అంటే వారానికి 25 కోట్లు ఈ షో ద్వారా అమితాబ్ వెనుకేసుకుంటున్నాడు. ఒక టివీ షోకి యాంకర్ గా చేసినందుకు ఒక్కో ఎపిసోడ్ కి ఇన్ని కోట్లా ఇస్తున్నారా అని అంతా ఆశ్ఛర్యపోతున్నారు. అమితాబ్ రేంజ్ మామూలుగా లేదుగా అన్న చర్చకూడా జరుగుతుంది.

×