
Health benefits of curry leaves : రోజువారిగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వాటిలో మధుమేహం, బీపీ, థైరాయిడ్, బరువు పెరగడం, గుండె జబ్బులు, జుట్టు రాలడం, రక్తహీనత, ముసలితనం త్వరగా రావటం, ఇలా ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూరు. దీనికంతటికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులు. ఆహార నియమాలు సరిగా పాటించకపోవటం , రోజువారిగా శారీరక వ్యాయామములు చేయకపోవటం వంటివి. అయితే మనం ఇప్పుడు చెప్పబోయే స్టోరీ అంతా ఒక ఆకు గురించి…చాలా మంది ఎవరినైనా తేలికగా తీసేయాలంటే వాళ్ళను కూరలో కరివేపాకు లాగా ఏరిపారేయండి అంటుంటారు. కాని కూరలో కరివేపాకు వేరివేయటం వల్ల మన ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని మాత్రం గుర్తించరు. వాస్తవానికి కూరలో కరివేపాకును తినటం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
కరివేపాకు మనకు మేలు కలిగించే అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం మెూదలు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వరకు ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. జుట్టు నల్లగా మార్చటంతోపాటు, బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలా గే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో దీని పాత్ర కీలకమనే చెప్పాలి.
చాలా మంది ఇళ్ళల్లో కూరల్లో వాసన కోసం, టేస్ట్ కోసం కరివేపాకు వాడుతుంటారు. అయితే వాస్తవానికి దీని పరిమళభరితమైన సువాసనే కాదు ఆరోగ్యానికి ఎంతగానో మేలు కలిగిస్తుంది. దీనిలో మనకు మేలు చేసే అనేక విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు ఉటాయి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించి మన ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి : మన శరీరంలో గుండె కీలకమైన ఆర్గాన్ … ఇది ఒక్క క్షణం ఆగిపోయినా ఇక అంతే సంగతులు. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గుండెకు కరివేపాకు ఎంతగానో మేలు చేస్తుంది. గుండె కవాటాలు చెడు కొలెస్ట్రాల్ తో మూసుకుపోకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెకి హానిచేసే వాటిని నిరోధించటంలో సహాయపడుతుంది. దీనిని రోజువారిగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు దరి చేరవు.
జీర్ణవ్యవస్ధకు : జీర్ణ వ్యవస్ధ సక్రమంగా ఉంటే మనం తిన్న ఆహారం శరీరానికి వంటపడుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందటం అన్నది జీర్ణ వ్యవస్ధపైనే అదారపడి ఉంటుంది. కరివేపాకులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది. చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కరివేపాకు బాగా ఉపకరిస్తుంది. రోజు ఉదయం నిద్రలేవగానే నోరు శుభ్రం చేసుకుని కనీసం రెండు మూడు కరివేపాకులు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
రోగనిరోధక శక్తి: శరీరంలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటే జబ్బులు రాకుండా నిరోధించుకోవచ్చు. ఇందుకుగాను యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాంటి వాటిలో కరివేపాకు కూడా ఒకటనే చెప్పాలి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో వచ్చే వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని పెంపొందిస్తాయి. ప్రతిరోజూ కరివేపాకును ఏరూపంలో తీసుకున్నా మీకు రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.
కంటి చూపుకు: కరివేపాలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కంటి చూపును మెరుగుపరుచుకోవాలనుకునే వారు కరివేపాకును రోజువారిగా తీసుకోవటం మంచిది. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రతిరోజూ తినడం వల్ల చూపు పెరుగుతుంది.
చక్కెర స్థాయిలను నియంత్రించటంలో : కరివేపాకు షుగర్ వ్యాధి గ్రస్తులకు ఒక వరంలాంటిది. షుగర్ వ్యాధి ఉన్న వారు రోజువారిగా కూరల్లో కరివేపాకును వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్ధాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది.
కాలేయం, చర్మ ఆరోగ్యం ; కరివేపాకు లివర్ ఆరోగ్యానికి బాగా ఉపకరిస్తుంది. మన శరీరంలో వ్యర్ధాలను పదార్థాలను తొలగిపోయేలా చేస్తుంది. కాలేయ పనితీరుకు సహాయపడే యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది.