వైసీపీకి ఏంకావాలి…చిచ్చు పెట్టటమే లక్ష్యమా ?

Andhra Pradesh politics 2025 : కూటమిలో కుంపట్లు పెట్టటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది. కూటమి ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ఏచిన్న అవకాశాన్ని వదులు కోవటం లేదు. ముఖ్యంగా టిడిపి , జనసేన పార్టీల మధ్య ఫైర్ రాజేస్తే ఆమంటలతో చలికాచుకోవాలని చూస్తుంది. ఇందుకు గాను చేయని ప్రయత్నాలు లేవు. పవన్ కు , చంద్రబాబు కు మధ్య దోస్తీని కట్ చేయటమే లక్ష్యంగా సోషల్ మీడియాలో, అలాగే ఆపార్టీ నేతల చేత వ్యాఖ్యలు చేయిస్తున్నారు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాబినేట్ సహచరులతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇన్ ఛార్జి సియం బాధ్యతలు అప్పగించ బోతున్నట్లు ఇటీవల ఒక గాలి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు సమాచారాన్ని సేకరించాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ కూడా ఇచ్చింది.

విదేశాలకు వెళితే బాధ్యతల్లో మార్పులు ఉంటాయా ?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివిధ దేశాల్లో పర్యటించిన సందర్భాలను మనం చూస్తున్నాం. విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారీ తన బాధ్యతలను వేరే వాళ్లకు అప్పగించిన సందర్భాలు లేనేలేవు. మరొకరికి ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించటమనేది రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచి లేదు. ఒకవేళ వారు అందుబాటులో లేని సందర్భంలో మాత్రమే వారు చేయాల్సిన పని బాధ్యతలను వేరొకరికి అప్పగించవచ్చు. ఉదాహరణకు ఫైల్స్ క్లియర్ వంటి బాధ్యతలు. వీటిని తమ క్యాబినేట్ సహచరుల్లో ఎవరోఒకరికి అప్పగించవచ్చు.

ఇక చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గానీ.. మాజీ సీఎం కేసీఆర్ కానీ విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఎక్కడా ఇంచార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించిన దాఖలాలు లేవు. అక్కడి నుంచే ఆన్ లైన్ లోనే సమీక్షలు నిర్వహించేవారని గుర్తు చేస్తున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రులను గౌరవించడంలో చంద్రబాబే తర్వాతే ఎవరైనా అని టీడీపీ, జనసేన శ్రేణులు చెబుతున్నాయి.

గతంలో కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంలుగా చాలా మంది పనిచేశారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో కూడా ఇంఛార్జి ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి అప్పగించలేదు. అదే సమయంలో డిప్యూటీ సియం ల చిత్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని అదేశాలు ఇచ్చిన దాఖలాలు జగన్ జమానాలో కనిపించలేదు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తన ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టే విధంగా అదేశాలు జారీ చేశారు.

ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించటం అన్నది సీఎం విచక్షణ అధికారంపైనే ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు అప్పగించాలనుకుంటే చంద్రబాబు ఇంఛార్జ్ సీఎంగా ఆయన్ని నియమించే అధికారం కూడా ఉంది.. ఆనారోగ్య కారణాలతో తన క్యాబినేట్ సహచరులుకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు విదేశీ పర్యటన నేపధ్యంలో ఇంఛార్జి సియం పవన్ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ సాగించిన చిల్లర ప్రచారం పెద్దగా రక్తికట్టకపోవటం ఆసక్తి కరం.

×