మహిళా డాక్టర్ హేమలత ఆత్మహత్య వెనుక అనుమానాలు ?

Woman Doctor Suicide : ఏపీకి చెందిన మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. అస్సాంలోని అలీ అహ్మద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పీజీ చదువుతున్న డాక్టర్ హేమలత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అస్సాంలోని బర్పేటాలో ఫఖరుద్దీన్ అలీ అహ్మద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది. 23 ఏళ్ల డాక్టర్ హేమలత ఈ కాలేజిలో పీజీ చదువుతుంది. మెడికల్ హాస్టల్ గదిలో డాక్టర్ హేమలత విగతజీవిగా కనిపించినట్లు హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

డాక్టర్ హేమలత ప్రసూతి, గైనకాలజీ విభాగంలో రెండవ సంవత్సరం పీజీ చదువుతుంది. ఈ ఘటనపై జరిపిన ప్రాదమిక విచారణలో ఆత్మహత్యగా తేలింది. అయితే పోలీసులు మరింత లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశాంత బిశ్వ శర్మ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటన చోటుచేసుకున్న వెంటనే మృతురాలి కుటుంబానికి సమాచారం అందించారు. వారు వచ్చిన తరువాతనే మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంచినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మృతురాలి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. చనిపోవటానికి ముందు హేమలత ఆత్మహత్యకు గల కారణాలు లేఖ రూపంలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఆలేఖను యాజమాన్యం దాచిపెట్టినట్లు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.

×