
Boiled eggs benefits : కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి మరింత మంచి చేస్తుంది. గుడ్డులో తెల్లసొన , పచ్చసొనలు ఉంటాయి. వీటిలో అనేక ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు , కోలిన్ వంటి పోషకాలు గుడ్డులో ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. మెదడు ఆరోగ్యానికి దీనిలో ఉండే కొలిన్ దోహదం చేస్తుంది. కండరాల పఠిష్టానికి, గుండె బలానికి, కంటి చూపును పెంచటానికి, బరువు తగ్గించటంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
గుడ్డును ఎలా తినాలి :
అయితే కోడి గుడ్డును ఎలా తినాలి అన్న విషయంలో చాలా మందిలో అనేక అపోహలు ఉంటాయి. ఉడికించి తినాలా లేదంటే ఆమ్లెట్ , వేపుకుని తినాలా అన్న సందేహంలో ఉంటారు. ఎలాతింటే మంచిదన్న విషయంపై అనేక పరిశోధనలు జరిగాయి. అయితే కోడి గుడ్డును వేపుడు రూపంలో కంటే ఉడికించుకుని తినటం మంచిదని తేలింది. ఎందుకంటే వేపుడుగా చేయటం, ఆమ్లెట్ రూపంలో అయితే అదనంగా నూనెలను యాడ్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి గుడ్డులోని కొవ్వులు ఉంటాయి కాబట్టి ఉడికించుకుని తినటం మేలు. అదే అసలైన ఆరోగ్యకరమైన విధానమని నిపుణులు సూచిస్తున్నారు.
ఉడికించిన గుడ్లలో పోషక విలువలు కలిగి ఉంటాయి. వేయించటం, వాటికి నూనెను యాడ్ చేయటం వల్ల మనశరీరంలో కొవ్వులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన గుండెకు, బరువు తగ్గడానికి గుడ్డును ఉడికించుకుని తీసుకోవటమే మంచిది. ఉడికించటం తద్వారా గుండెకు హానికలిగించే కొవ్వు మొత్తాలను తగ్గించుకుని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఉడికించిన గుడ్లు ఆహారంలో చేర్చుకోవం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. వాటిలోని అధిక ప్రోటీన్ ఎక్కువసమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. అలాగే అధికమోతాదులో ఆహారాన్ని తినాలనే కోరికను తగ్గిస్తుంది.
ఉడికించిన గుడ్లలో అదనపు కొవ్వులు లేనందున జీర్ణం త్వరగా అవుతాయి. కండరాల పఠిష్టానికి,జీర్ణ ఆరోగ్యానికి ఉడికించిన గుడ్డు తినటం బెటరని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ధరలో లభించే ప్రోటీన్ కలిగినది గుడ్డు మాత్రమే. రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు (Boiled egg) తింటే అనేక రకాల సూక్ష్మపోషకాలు శరీరానికి అందుతాయి. గుడ్డు తినం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు…బెనిఫిట్స్ మాత్రం అధికంగా ఉంటాయి.