ఫ్యాటీ లివర్ సమస్యకు సహజ పరిష్కారం…రోజుకు ఒక గ్లాస్ చాలు

ఇటీవలి కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల అదనపు కొవ్వు శరీరంలో ఏర్పడుతుంది. ఈ అదనపు కొవ్వు లివర్ పని తీరుపై ప్రభావం చూపిస్తుంది. అదనపు కొవ్వులను లివర్ బయటకు పంపలేకపోవంతో చివరకు అది లివర్ లో పేరుకుంటుంది. అలా పేరుకుంటే మన లివర్ ఫ్యాటీ లివర్ గా మారిపోతుంది. ఫ్యాటీ లివర్ సమస్య వస్తే అనేక ఇబ్బందులు వస్తాయి.

ఫ్యాటీ లివర్ వల్ల పచ్చ కామెర్లు వస్తాయి. కొన్నిస్లారు ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఫ్యాటీ లివర్ సమస్య గుర్తించిన వెంటనే వీలైనంత త్వరగా తగ్గించుకోవటం మంచిది. ఫ్యాటీ లివర్ ని తగ్గించుకునేందుకు మందులు అందుబాటులో ఉంటాయి. దానియొక్క తీవ్రతను బట్టి వైద్యులు మెడిసన్ సూచిస్తారు. వైద్యుల సలహా మేరకు వాటిని తీసుకోవాలి. వీటితో పాటు కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు.

ఫ్యాటీ లివర్ తగ్గించుకునేందుకు అల్లం, నిమ్మకాయ చిట్కా ;

అల్లం, నిమ్మకాయ ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ రెండింటిలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు ప్రయోజనాలు మరింత రెట్టింపవుతాయి. నిమ్మకాయ, అల్లం లివర్ ని క్లీనింగ్ లో ఉపకరిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలం. లివర్ లో పేరుకుపోయిన వ్యర్ధాలు టాక్సిన్స్ బయటకు పంపటంలో తోడ్పడతాయి.

అల్లం, నిమ్మతో ఏంచేయాలి ;

ముందుగా రెండు అల్లం ముక్కలు ,నాలుగు నిమ్మకాయ ముక్కలు తీసుకోవాలి. ఓ లీటర్ నీటిలో వాటిని వేసి బాగా మరిగించాలి. ఇలా చేస్తే లివర్ డిటాక్స్ డ్రింక్ తయారవుతుంది. తయారు చేసుకున్న ఈ డ్రింక్ ని ఎక్కువ సమయం నీళ్లు వేడిగా ఉండే కంటెయినర్ లో పోసుకోవాలి. ఈ లీటర్ నీటిని రోజంతా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అందులో ఉన్న పోషకాలు బాడీకి అందుతాయి..ఈ డ్రింక్ ని కనీసం 15 రోజుల పాటు ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. రోజువారీగా చేస్తే మరీ మంచిది.

గమనిక ; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

×