అమరావతికి మైక్రోసాఫ్ట్…క్వాంటమ్ వ్యాలిలో పరిశోధన కేంద్రం

Quantum Valley Andhra Pradesh : అంధ్రప్రదేశ్ రాజధాని వైపు దిగ్గజ ఐటి సంస్ధల చూపు పడింది. రాజధాని అమరావతి సాంకేతిక నగరంగా అడుగులు వేస్తున్న తరుణంలో క్వాంటమ్‌ వ్యాలీలోకి దిగ్గజ సంస్థలు వాలిపోతున్నాయి. ఐబీఎం సంస్ధ ఇప్పటికే క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఏర్పాటుకు తొలి అడుగు వేయగా, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌(Microsoft) కూడా తమ పరిశోధన కేంద్రం పెట్టేందుకు రెడీ అయిపోయింది. సంస్థ ప్రతినిధులు , ఏపి అధికారుల మధ్య చర్చలు చివరి అంకానికి చేరాయి. మైక్రోసాఫ్ట్‌ క్వాంటమ్‌ వ్యాలీలో ‘క్వాంటమ్‌ పరిశోధన’ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సంబంధించి త్వరలో ఏపి సర్కారుతో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్‌ల సామర్థ్యంతో క్వాంటమ్‌ కంప్యూటర్​ను ఏర్పాటుకు ఓప్పందం చేసుకుంది. వీటితోపాటుగా ప్రముఖ సంస్థలూ మరికొన్ని అమరావతికి(amaravathi) క్యూకట్టబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐబీఎం సంస్థ ఒక డెకో సిస్టమ్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ కు భిన్నంగా క్వాంటమ్‌ కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేయనుంది. ఇదిలా వుంటే మైక్రోసాఫ్ట్‌ ఎన్ని క్యూబిట్‌ల సామర్థ్యంతో కూడిన కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

మైక్రోసాఫ్ట్‌కు క్వాంటమ్‌ వ్యాలీలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అయితే దీని సంస్ధ సొంతంగా నిర్మిస్తుందా…లేదంటే ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందా అనేది ఓప్పందం లో తేలనుంది. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 50 క్యూబిట్స్‌ సామర్థ్యంతో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్‌ నెలకొప్పింది. అమరావతిలో క్వాంటమ్‌ టెక్నాలజీ కి ముందడుగు వేయడంతో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అమరావతిని మైక్రోసాఫ్ట్ ఎంపిక చేసుకుంది.

మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి ;

ప్రముఖ టెక్ సంస్ధలు వరుసగా వస్తుండటంతో ఏపి ఇమేజ్ పెరుగుతన్నట్లు పలువురు అంటున్నారు. మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ, ఎగుమతుల కోసం అమెరికాలోని ప్రధాన కేంద్రం తర్వాత హైదరాబాద్‌లో ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో హైదరాబాద్‌ రేంజ్ పెరిగింది. అలాగే అమరావతి కేంద్రంగా క్వాంటమ్‌ వ్యాలీలో మౌళిక సదుపాయాల బాధ్యత ప్రభుత్వానిదే. దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది.

ఐబీఎం సంస్థ, ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ కంపెనీలకు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్‌ భవనాన్ని ప్రభుత్వం నిర్మించనుంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో సాంకేతికతను మెరుగు పరిచేందుకు గూగుల్, అమెజాన్, అయాన్‌క్యూ, క్వాంటిన్యూమ్‌,రిగెట్టి కంప్యూటింగ్, వంటి సంస్థలు పరిశోధనలు చేపటడతాయి. అదే సందర్భంలో వివిధ సంస్థలను అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి తీసుకువచ్చేలా సంప్రదింపులను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జరుపుతున్నారు.

×