పైల్స్ సమస్య…కారణాలు…లక్షణాలు..చిట్కాలు

Piles Causes and Symptoms : ఇటీవలి కాలంలో పైల్స్ సమస్య సర్వసాధరణమైంది. సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధే అయినా జీవన శైలిలో మార్పుల వల్ల పైల్స్ సమస్య వస్తుంది. వైద్య పరిభాషలో హెమరాయిడ్స్‌ అని సామాన్య పరిభాషలో పైల్స్ అని అంటారు. తెలుగులో వీటిని మొలలు అని పిలుస్తారు.

ఎవరికి ఈ సమస్య వస్తుంది ;

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణం.. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి, సరియైనా ఆహార నియమాలు పాటించని వారికి, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటిని ఎదుర్కొంటున్నవారికి ఈ సమస్య వస్తుంది. నీరు తక్కువగా తీసుకోవటం, మద్యం అధికంగా సేవనం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుడు కూరలు ఎక్కువగా తినడం, మాంసాహరం ఎక్కవగా తినేవారిలో పైల్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువా ఉంటాయి. అలాగే ఆహారంలో ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో ఎక్కువ వ్యర్థాలు పేరుకుపోయి చివరకు పైల్స్‌కు దారితీస్తుంది.

పైల్స్(Hemorrhoids) సమస్య ఉంటే కనిపించే లక్షణాలు:

పైల్స్ సమస్య ఉన్నవారిలో మల విసర్జన సాఫీగా ఉండదు. అలాగే మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, ఒక్కోసారి రక్తస్రావం కావటం, మంటగా ఉండటం వంటి లక్షణాలు వుంటాయి. మల విసర్జన తరువాత కూడా కొందరిలో నొప్పి , మంట రెండు గంటల పాటు ఉంటుంది. విరోచనం సాఫీగా కాకుండా ఇబ్బంది పడుతుంటారు. సుఖ విరోచనం అవ్వకపోవటం వల్ల చికాకుగా, కోపంగా ఉంటారు. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) అనేవి లోపలి నుండి బయటకు పొడుచుకొని వస్తుంటాయి. సమస్య ఒకసారి వస్తే దీర్ఘకాలంపాటు వేధిస్తుంది. వ్యాధికి తొలిదశలోనే చికిత్స తీసుకోవడం మంచిది.

పైల్స్ సమస్య ఉన్నవారు పాటించాల్సిన చిట్కాలు ;

పైల్స్ ఉన్నవారు ఎక్కువ నీరు త్రాగడం చాలా ముఖ్యం. పైల్స్ తో బాధపడే వ్యక్తి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగాలి.

పైల్స్ కు కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుండాలి.

పైల్స్ కు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసం వరకు తీసుకోవచ్చు.

పైల్స్ కు అల్లం -నిమ్మరసం జ్యూస్ బాగా ఉపకరిస్తుంది. పైల్స్ కు డీహైడ్రేషన్ కూడా ఒక కారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను రోజూ రెండు సార్లు తాగాలి.

అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి తగ్గుతుంది.

మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా ఉపకరిస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం, జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి నొప్పిని తగ్గిస్తుంది.

అరటిపండు తింటే మలబద్ధకం తగ్గుతుంది. ప్రతిరోజూ భోజనం తర్వాత అరటిపండు తినటం మంచిది.

బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండేవి తినటం మంచిది. ఇవి తేలికగా జీర్ణమై పేగులు శుభ్రపడతాయి.

సహజంగా పైల్స్ ను నివారించేందుకు పసుపుకొమ్మ లేదంటే పసుపును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి.

మలబద్దకం నివారణకు రెగ్యులర్ వ్యాయామం బాగా ఉపకరిస్తుంది.. అలాగని అతిగా వ్యాయామం చేయడం, ఎక్కువ బరువులు మోయడం వల్ల పైల్స్ సమస్య మరింత అధికం అవుతుంది.

గమనిక ; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి వారిచ్చే సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

×