చంద్రబాబు సింగపూర్ పర్యటనతో అమరావతికి మేలు కలిగేనా ?

Chandrababu Naidu Singapore Tour : మరోసారి సింగపూర్ వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు పడబోతున్నాయి. ఈ నెల 26 నుండి 30 వతేది వరకు ఆయన సింగపూర్ లో పర్యటించబోతున్నారు. తన కలలస్వప్నమైన అమరావతి రాజధాని నిర్మాణంలో గతంలో భాగస్వాములై, ఆతరువాత వైసిపి ప్రభుత్వం చేత తరిమివేయబడిన సింగపూర్ ప్రభుత్వాన్ని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేలా ఒప్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ పర్యటన ఉండబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

పట్టణ ప్రణాళిక, నగరాల సుందరీకరణ, ఓడరేవుల అభివృద్ధి, లాజిస్టిక్, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిలో సింగపూర్ సహకారం తీసుకోవడానికి చంద్రబాబు బృందం అక్కడి ప్రతినిదులతో సమమావేశం కానుంది. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టీజీభరత్, ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, CRDA కమిషనర్ కన్నబాబు తదితరులు వెళ్లనున్నారు.

అమరాతి నిర్మాణానికి ప్రణాళికలు వేసిందే సింగపూర్ కన్సార్టియం

రాష్ట్ర విభజన జరిగి అంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తరువాత నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఏంపిక చేశారు. దీని నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతి రాజధాని కోసం మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని చంద్రబాబు అప్పటి సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు. సహకారంతో అమరావతికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన జరిగింది. అమరావతి స్టార్టప్ ఏరియా డవలెప్‌మెంట్ కోసం సింగపూర్ కన్సార్టియం తో ఒప్పందం కుదిరింది. అసెండాస్ సింగ్‌బ్రిడ్జ్- సెంబ్‌కార్ప్ సంస్థల భాగస్వమ్యంతోనే సింగపూర్ కన్సార్టియం ఏర్పాటైంది. అమరావతిలో 6.84 చదరపు కిలోమీటర్ల ‘స్టార్టప్ ఏరియా’ను అభివృద్ధి చేయటంపాటు, వాణిజ్యాభివృద్ధికి ఈ సంస్ధ తోడ్పాటు అందించాల్సి ఉంటుంది.

అమరావతికి అవసరమైన టెక్నాలజీతోపాటు, పలు స్టార్టప్‌లను అమరావతికి రప్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. మూడు దశల్లో అనగా 15 సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు పర్యటనతో మళ్లీ సింపూర్‌ పై ఆశలు చిగురిస్తున్నాయి.

జగన్ ప్రభుత్వం అమరావతికి ద్రోహం

చంద్రబాబు ప్రభుత్వం 2019లోఅధికారం కోల్పోయి మరుక్షణం జగన్ అమరావతి రాజధాని నిర్మాణాన్ని గాలికొదిలేసి మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారు. సింగపూర్ సంస్ధను అప్పుడే తరిమి కొట్టారు. సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆసంస్ధ వెళ్ళిపోయింది. చంద్రబాబు సీఎం ఏడాది పాలన ముగిసింది. ఒకవైపు అమరావతి నిర్మాణపనులు వేగంగా కొనసాగుతున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుతూ పాలనను మెల్లగా గాడిలో పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. అమరావతికి ఇప్పటికే వివిధ మార్గాల్లో౩౩వేల కోట్ల రూపాయలు సమీకరించారు. ఆగిపోయిన పనులన్నీపట్టాలెక్కించారు.

ప్రభుత్వం భవనాలు పూర్తిచేయడం, ఇతర పెట్టుబడులను తీసుకురావడంపై ఒకవైపు దృష్టిసారిస్తూనే అమరావతి విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నారు. మరి సింగపూర్ పర్యటన ద్వారా కొత్తగా అమరావతికి చంద్రబాబు ఏంచేయబోతున్నారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

×