
samosa and jalebi : మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలు, జిలేబీలు, లడ్డూలు, పకోడీ వంటి చిరుతిండ్ల వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్ల పక్కన బండ్లపై నోరూరించే రుచికరమైన సమోసాలు,జిలెబీలు పకోడీలను కొనుగోలు చేసి తినేస్తుంటాం.. ఈ ఫ్రైడ్ ఫుడ్స్ నోటికి రుచికరంగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా అంతే హాని కలిగిస్తాయి. వీటి వల్ల ఊబకాయం సమస్యలు అధికమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం ;
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రో త్సహించేలా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాల ప్రదేశాల్లో ఉండే క్యాంటీన్లలో, అలాగే పబ్లిక్ ప్రదేశాలలో “ఆయిల్ అండ్ షుగర్ బోర్డులు” ఏర్పాటు చేయాలని అదేశాలిచ్చింది. మనం తినే స్నాక్స్ లో ఎంత కొవ్వు, నూనె, చక్కెర ఉన్నాయో తెలియజేస్తాయి. ప్రజలు ఇష్టంగా తినే ఈ సమోసా, జిలేబీ. పకోడా వంటి వాటిలో ఎన్ని కేలరీలు ఉన్నాయి, ఎంత కొవ్వు ఉందో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ బోర్డుల ఏర్పాటు ముఖ్య ఉద్ధేశం. ఈ బోర్డుల ఏర్పాటు అవగాహన కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగమే.
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించేందుకు నూనె వినియోగాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇలా బోర్డులు డిసిప్లే చేయటం ద్వారా ఏఏ ఆహారాలను తినేందుకు ఎంచుకోవాలో ప్రజల్లో అవగాహన వస్తుంది. త్వరలో నాగ్పూర్ ఎయిమ్స్ వంటి ప్రదేశాలలో ఫుడ్ కౌంటర్ల వద్ద క్యాంటీన్లలో, స్నాక్స్ బడ్డీల వద్ద ఇతర ప్రదేశాలలో ఫుడ్ లేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. “ఆయిల్ అండ్ షుగర్ బోర్డులు” పెట్టడం ద్వారా ప్రజలు తాము ఎన్ని కేలరీలు, ఎంత ఫ్యాట్ తీసుకుంటున్నారో వారికి తెలుస్తుంది. దీని వల్ల వారి ఆరోగ్య సంరక్షణకు మేలుకలుగుతుంది.
పెరుగుతున్న ఊబకాయం ;
పోషకాహార నిపుణుల ప్రకారం.. భారత్ లో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆహారపు అలవాట్లు ఇలాగే కొనసాగి తే 2050 కల్లా 44.9 కోట్లకు భారతీయులు అధిక బరువు, ఊబకాయంతో బాధపడతారని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఊబకాయం తో బాధపడుతున్న వారి సంఖ్యలో అమెరికా తర్వాత భారత్ రెండవ స్థానంలో నిలుస్తుందని అంచనా..ప్రస్తుతం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.