నిత్యం వ్యాయామం వల్ల రక్త ప్రసరణ ఎలా మెరుగవుతుంది?

Blood Circulation: రోజువారి వ్యాయామం (exercise) ఆరోగ్యానికి ఎంతగానో మేలు కలిగిస్తుంది. ముఖ్యంగా వ్యాయామం వల్ల రక్త ప్రసరణను (blood circulation) గణనీయంగా మెరుగుపడుతుంది. నిత్యం శారీరక కదలికలు గుండె ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. గుండె పనితీరును మరింత సమర్థవంతంగా మారుస్తాయి. వ్యాయామాల వల్ల శరీరంలోని కండరాలు,ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రక్తంతో పాటు ఆక్సిజన్, పోషకాలు సమర్థంగా శరీరానికి అందేందుకు వీలుకలుగుతుంది. వ్యాయామం వల్ల రక్తనాళాలను విస్తరిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మొత్తం గుండె సంబంధిత ఆరోగ్యం మెరుగుపడేందుకు వ్యాయామం దోహదం చేస్తుంది.

వ్యాయామంతో రక్త ప్రసరణ ఎలా మెరుగవుతుంది ;

1.వ్యాయామం గుండె (heart) కండరాలను పఠిష్టపరిచి, రక్తాన్ని సమర్థవంతంగా సరఫరా అయ్యేలా చేస్తుంది.

2.రక్తప్రసరణ పెరగడం వల్ల కండరాలతోపాటుగా, శరీర అవయవాలకు ఆక్సిజన్, పోషకాలు మెరుగ్గా అందుతాయి. అవి సరైన రీతిలో శరీరానికి అంది అవయవాలు పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే అలసటను తగ్గిస్తుంది.

3.వ్యాయామం రక్తనాళాలను విస్తరించటం ద్వారా రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు సహాయపడుతుంది. దీని వల్ల రక్తం అవయవాలకు, సులభంగా చేరుతుంది.

4.రోజువారీగా వ్యాయామం చేయడం రక్తపోటును తగ్గించటంలో ఉపకరిస్తుంది. గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ సాఫీగా సాగేందుకు మంచిది.

5.రక్తప్రసరణ మెరుగుపడటం ద్వారా గుండె బలపడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

6.వ్యాయామం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, గుండె ఆరోగ్యానికి, రక్తప్రసరణకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

7.ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం వల్ల రక్తంలోని మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. రోజుకు గంటసేపు వాకింగ్ చేస్తే క్యాలరీలు కరగటంతోపాటుగా, శరీరంలోని విషపదార్ధాలు బయటకు పోతాయి. ఫలితంగా రక్తప్రసరణ ( Blood Circulation )మెరుగవుతుంది.

×