
illegal registrations ; ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు (illegal registrations) ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దుచేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి ఇస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ నేపధ్యంలోనే నోటిఫికేషన్ ను జారీచేశారు. సివిల్ కోర్టులకు మినహా అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దుచేసే అధికారం ఇప్పటి వరకు ఎవరికీ లేదు. దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర అక్రమ పద్ధతుల్లో అక్రమ పద్ధతుల్లో ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్లకు అడ్డుఅదుపులేకుండా పోయింది. కోత్త చట్టం అమలు లోకి రావటంతో ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్టపడబోతుంది.
ఫిర్యాదుల పరిశీలిన ;
రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతుల్లో జరిగినట్లు ఫిర్యాదులు వచ్చిన వెంటనే జిల్లా రిజి స్ట్రార్ వాటిని పరిశీలిస్తారు. అధారాలు పక్కాగా ఉంటే కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమిటీకి సిఫార్సు చేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తోపాటు, జిల్లా రిజిస్ట్రార్, ఇతర అధికారులు ఉంటారు. నిషిద్ధ జాబితా నుంచి విడిపించిన 13 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ (ఎసైన్డ్) భూముల్లో సుమారు 25వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే జరిగాయి. ఇందులో ఆక్రమాలు 7వేల ఎకరాలు వరకు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా ఉత్తర్వులతో ఇలాంటి రిజిస్ట్రేషన్లను రద్దుచేసేందుకు అవకాశం ఉంటుంది.
మూడేళ్ల జైలు ;
నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసినా, లేదంటే ఆస్తికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసినా, కోర్టు ఎటాచ్మెంట్లో ఉన్నవాటికి రిజిస్ట్రే షన్లు చేస్తే అలాంటి సబ్-రిజిస్ట్రార్లకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు సవరించిన చట్టంలో స్పష్టత నిచ్చారు. విధినిర్వహణలో సబ్-రిజిస్ట్రార్ అలసత్వం వల్ల క్రయ, విక్రయదారులకు నష్టం కలిగినట్లు రుజువైతే ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చని ఇప్పటికే అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టం స్పష్టం చేస్తుంది.
బ్రాండెడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే స్టాంప్ట్యూటీ వసూలు
బ్రాండెడ్ కంపెనీలతో వ్యాపారం చేసేందుకు కంపెనీలు, వ్యక్తులు చేసు కునే ఒప్పందాల విలువ మేరకు స్టాంపుడ్యూటీ వసూలు అమలు నోటిఫికేషన్ ను రెవెన్యూ శాఖ జారీచేసింది. ఈ నోటిఫికే షన్ అనుసరించి తీసుకునే చర్యలు ఉత్తర్వుల్లో రెవెన్యూశాఖ పేర్కొంది. ఒప్పంద కాలపరిమితి ఏడాది వరకు ఉంటే రూ.1,000, పదేళ్లలోపు ఉంటే ఏడాదికి రూ.1,000 చొప్పున స్టాంపుడ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్లు దాటితే రూ.25,000 వరకు స్టాంపుడ్యూటీని కట్టాల్సి ఉంటుందని నిభంధనలు చెబుతున్నాయి.