రాయ్‌పూర్‌కు వెళ్తున్న ఇన్డిగో విమానంలో సాంకేతిక లోపం….అత్యవసర ల్యాండింగ్

ఇండోర్లో మంగళవారం 51 మంది ప్రయాణికులతో ఇన్డిగో ఇన్డోర్-రాయ్‌పూర్ విమానం టేక్‌ఆఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం తిరిగి ఇన్డోర్ విమానాశ్రయానికి చేరిందని అధికారవర్గాలు తెలిపాయి.

ఇన్డిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ నంబర్ 6E-7295 టేక్‌ఆఫ్ అయింది. సుమారు 60 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించిన అనంతరం పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఉదయం 6.35 గంటల సమయంలో విమానం ఇన్డోర్ విమానాశ్రయం నుండి టేక్‌ఆఫ్ అయిందని ఇన్డోర్‌ దేవీ అహిల్యాబాయ్ హోళ్కర్ విమానాశ్రయ డైరెక్టర్ విపిన్‌కాంత్ సేథ్ తెలిపారు. కొన్ని నిమిషాల తర్వాత పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కు సమాచారం అందించి తిరిగి వెనుదిరిగి వచ్చింది.

అత్యవసర ల్యాండింగ్ కాదని, సాంకేతిక లోపం ఏమిటన్న వివరాలు తెలుసుకోవాల్సి ఉందని విమానాశ్రయ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఆ విమానంలో మొత్తం 51 మంది ప్రయాణికులు ఉన్నారు.

×