
YouTube policy violation 2025 : యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించటం ఇటీవలి కాలంలో ఒక మార్గమైంది. 1,000 మంది సబ్స్క్రైబర్లు, 4,000 గంటల పబ్లిక్ వాచ్ అవర్లను కలిగి అలాంటి యూట్యూబ్ ఛానల్స్ కు మానిటైజేషన్ ఇచ్చేస్తుంది. కంటెంట్ మధ్యలో యూట్యూబ్ ప్రకటనలను చూపించటం ద్వారా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వారికి డబ్బు వచ్చేలా చేస్తుంది. ఎక్కువ మంది ప్రకటనలను చూసిన లేదంటే వాటిపై క్లిక్ చేసినా ఎక్కువ డబ్బు పొందొచ్చు.
అయితే ప్రస్తుతం యూట్యూబ్ కొన్ని ఛానల్స్ కు భారీ షాక్ ఇచ్చింది. ఇటీవలి కాలంలో యూట్యూబ్ ను అడ్డంపెట్టుకుని ఉన్నవి లేనివి అన్ని కలబోసి అసత్యాలను ప్రచారం చేయటం పరిపాటైంది. ఈ క్రమంలోనే ఈ అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్న ఛానల్స్ పై కొరడాఝళిపించింది. దాదాపు 11వేల యూట్యూబ్ ఛానళ్లను లేపేసింది. తొలగించిన ఛానల్స్ లో చైనా, రష్యాకు చెందినవే అధికం. చైనాకు చెందిన 7,700 యూట్యూబ్ ఛానళ్లు తొలగించిన వాటిలో ఉన్నాయి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు భారతదేశంలో నిర్వహిస్తుండటమే ఇందుకు కారణం. చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ కంటెంట్ లను వండి వారుస్తున్నారు.
అలాగే 2,000లకు పైగా రష్యాకు చెందిన యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లను తొలగించింది. వీటిని తొలగించటానికి ముఖ్యకారణం ఉక్రెయిన్, నాటోలపై విమర్శలు చేయటమే. రష్యాకు మద్దతిచ్చేలా సందేశాలను వ్యాప్తి చేయటం మరోకారణం. రష్యాలోని పలు సంస్థలకు కూడా ఈ ఛానల్స్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మధ్యనే 20 యూట్యూబ్ ఛానెల్‌లు, 4 వెబ్ సైట్లు, రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నఓ బ్లాగును తొలగించింది. 2025 ప్రారంభమైన మొదటి మూడు నెలల కాలంలోనే గూగుల్ 23,000 లకు పైగా ఖాతాలను తొలగించింది. నేటి వరకు ఆసంఖ్య 30,000 వేలను దాటింది. అలాగే మెటా సంస్ధ ఇటీవల 10 మిలియన్ల నకిలీ ప్రొఫైల్స్ ను తొలగించింది.