పాముతో చెలగాటం…చివరకు ప్రాణాల మీదకు

Snake Catcher Dies : మధ్యప్రదేశ్ లోని కట్​రా మొహల్లాకు చెందిన దీపక్ మహావర్ గత కొన్నేళ్లుగా స్నేక్ రెస్క్యూగా గుర్తింపుపడ్డాడు. రాఘోగఢ్ బర్​బట్​పురా గ్రామంలో పాము కనిపించటంతో స్ధానికులు ఆ సమాచారం దీపక్ మహావర్ ఇచ్చారు. వెంటనే ఆ గ్రామానికి చేరుకున్న దీపక్​ విషనాగును పట్టుకున్నాడు. ఈసమయంలోనే తన కుమారుడిని స్కూల్ నుండి వదిలిపెట్టారని ఫోన్ వచ్చింది. దీంతో దీపక్​ హడావుడిగా పాఠశాలకు వెళ్లే క్రమంలో ఆ పామును మెడలో వేసుకుని బండి పై బయలుదేరాడు.

స్కూల్ వద్ద కు వెళ్ళి కుమారుడిని బండిపై ఎక్కించుకుని ఇంటికి తిరిగి వస్తున్న దీపక్ మహావర్​పై మెడలోని పాము ఒక్కసారిగా అతని చేతిపై కాటు వేసింది. దీంతో దీపక్ వెంటనే తన స్నేహితుల సహాయంతో రఘోఘర్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు దీపక్​ను గుణా జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.

మెరుగైన చికిత్స అనంతరం దీపక్​ తిరిగి ఇంటికి బయలుదేరాడు. అర్థరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా అతడు శ్వాస తీసుకోలేని పరిస్ధితుల్లో ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని తిరిగి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రాఘోగఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం రాఘోగఢ్ ఆసుపత్రికి తరలించారు. దీపక్​ పామును మెడలో వేసుకున్న వీడియో దృశ్యాలు ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

×