నిరుద్యోగులకు గుడ్ న్యూస్… రైల్వేలో 30వేల ఉద్యోగాలు

రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఇది వారి కోసమే. ఆర్ ఆర్ బి సికింద్రా బాద్ పరిధిలో మొత్తం 5 పోస్టుల్లో 30,307 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ సికింద్రబాద్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో ఈ కింద ప్రకటించిన పోస్టులను భర్తీ చేయనుంది

  1. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్‌ 6235 పోస్టులు
  2. స్టేషన్ మాస్టర్‌ 5623 పోస్టులు
  3. గూడ్స్ ట్రైన్ మేనేజర్‌ 3562
  4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌ 7520 పోస్టులు
  5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌ 7367 పోస్టులు

అర్హతలు:

అధికారిక నోటిఫికేషన్ చూడటం ద్వారా తెలుసుకోవాలి.

వయోపరిమితి:

ప్రతి పోస్టుకు అభ్యర్థుల వయసు 18-32 ఏళ్ల మధ్యలోనే ఉండాలి.

వేతనం:

చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్‌- రూ.35,400, స్టేషన్ మాస్టర్‌- రూ.35,400, గూడ్స్ ట్రైన్ మేనేజర్‌- రూ.29,200, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌- రూ.29,200, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌- రూ.29,200

దరఖాస్తులు:

అభ్యర్థులు తమ దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. అధికారక వెబ్‌సైట్‌ను సందర్శించి, అప్లికేషన్ ఫార్మ్‌ను పూర్తి చేసి, తగిన ఫీజును చెల్లించాలి. అదేవిధంగా, కావాల్సిన పత్రాలను సైతం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

30 ఆగస్ట్‌, 2025న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై, 29 సెప్టెంబర్‌, 2025న ముగుస్తుంది. ఈ సమయంలోనే దరఖాస్తులు చేసుకోవడం, ఫీజు చెల్లించడం పూర్తి చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించే నోటిఫికేషన్‌ను పరిశీలించగలరు.

×