ఈ సమస్యలు ఉన్నవారు నెయ్యి తినొద్దు !

పాలను పెరుగుగా మార్చటం తద్వారా లభించే నూనె వంటి పదార్ధమే నెయ్యి. భారతీయులు తమ రోజువారి వంటకాల్లో నెయ్యి (Ghee)ని ఎక్కువగా వాడుతుంటారు. నెయ్యితో చేసే పదార్ధాలంటే ఎంతో ఇష్టంగాను తింటారు. స్వీట్స్‌ (Sweets) నుంచి టిఫిన్స్‌ (Tiffins) వరకు అన్నింట్లో నెయ్యిని ఉపయోగిస్తారు. నెయ్యితో తయారు చేస్తే ఆహారానికి అదనపు రుచి వస్తుంది. పప్పు, పచ్చడి, చపాతీ వంటి వాటికి నెయ్యిని చేర్చితే వాటి రుచి అమోఘంగా ఉంటుంది. రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతుంటారు.అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

నెయ్యి ఎవరు తినకూడదు ?

గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు నెయ్యిని ఎక్కువగా ఉపయోగించరాదని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం కారణంగా ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు నెయ్యిని తినకూడదు. గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలతో బాధపడుతున్నవారు నెయ్యిని తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది.

రక్తపోటు (bp) సమస్యలు కలిగి ఉంటే నెయ్యిని మాత్రం ముట్టుకోవద్దు. నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు రక్తపోటును మరింత పెంచుతాయి.దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్యలు వచ్చినప్పుడు నెయ్యిని తినకపోవడమే మేలు.

అధిక బరువు , బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నవారు నెయ్యి తినొద్దు. నెయ్యి ఎక్కువగా తింటే బరువు పెరిగిపోతారు. నెయ్యిలో కాలరీలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల బరువు బాగా పెరిగే ప్రమాదం ఉంది.

షుగర్ సమస్య ఉన్నా కూడా నెయ్యికి దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఉండే కొవ్వులు కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. షుగర్ పేషెంట్స్‌ నెయ్యికి దూరంగా ఉండటం మంచిది.

గమనిక ; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

×