నిరుద్యోగులారా త్వరపడండి…ఈ ఉద్యోగాలు మీకోసమే!

RPSC School Lecturer Recruitment 2025: ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లో భాగంగా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2025 సంవత్సరానికి స్కూల్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3,225 గ్రేడ్ 1 టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

ఖాళీలు, అర్హతలు, అధికారిక వెబ్‌సైట్‌ తదితర వివరాలు ;

మొత్తం ఖాళీల సంఖ్య :

గ్రేడ్‌-1 టీచింగ్ పోస్టులు- 3,225

దరఖాస్తు చేసుకునే వారి అర్హతలు :

సంబంధిత సబ్జెక్టులో పిజి డిగ్రీతో పాటు గుర్తింపు కలిగిన సంస్థ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B Ed) పూర్తిచేసిన సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు ;

అభ్యర్ధుల వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి, రాజస్థాన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అభ్యర్థుల వయో సడలింపులు వర్తిస్తుంది.

దరఖాస్తులు:

ఆన్‌లైన్‌లో.. అధికారిక వెబ్‌సైట్‌ rpsc.rajasthan.gov.in ను సందర్శించి దరఖాస్తులను పూర్తి చేయాలి.

ముఖ్యతేదీలు:

ఆగస్టు 14, 2025 నుండి సెప్టెంబర్ 12, 2025 వరకు దరఖాస్తులను సెండ్ చేయవచ్చు.

ఫీజు :

వివిధ కేటగిరీలను బట్టి ఫీజులు నిర్ణయించారు. జనరల్ & OBC (క్రీమీ లేయర్)- 600రూపాయలు ,OBC (నాన్-క్రీమీ లేయర్), EWS, SC, ST, & PwD 400రూపాయలు ఆన్‌లైన్‌ మోడ్ లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం :

రెండు దశల్లో ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. రాత పరీక్ష అభ్యర్థులను వారి సబ్జెక్టు నైపుణ్యంపై మూల్యాంకనం చేస్తారు. విద్యార్హతలు, అర్హత పత్రాలు, అకడమిక్ సర్టిఫికెట్ల పరిశీలిన చేస్తారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ పరిశీలించి, దరఖాస్తు చేసుకోవాలి.

×