
AP Forest Department jobs 2025 : నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ఉద్యోగల భర్తీలో దూకుడుగా ముందుకు పోతుంది. ఈ క్రమంలోనే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అటవీ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేపట్టనుంది.
మొత్తం ఖాళీలు:
691 (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 435)
విద్యా అర్హతలు:
ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది).
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ (Physical Measurement Test), రన్నింగ్ పరీక్ష ఆధారంగా ఎంపిక
వేతనం:
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ. 25,220 – 80,910, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు రూ. 20,000 – 70,000 వరకు వేతనం
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ:
జూలై 16, 2025
దరఖాస్తు చివరి తేదీ:
ఆగస్టు 5, 2025 వరకు
అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ను సందర్శించండి