
విజయవాడ, జూన్ 6, 2025: తొలి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డీజీపీ దంపతులకు దుర్గగుడి ఈవో శీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శనానంతరం డీజీపీ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ప్రసాదంతో పాటు, అమ్మవారి చిత్రపటం అందచేసి ఆలయంలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనుల గురించి డీజీపీకి వివరాలు తెలియజేశారు.