
శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందంటున్నారు నిపుణుడు కన్నయ్యనాయుడు…ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ రేడియల్ క్రస్ట్ గేట్లను మార్చకుంటే ఏక్షణంలోనైనా ముప్పుతప్పదన్న హెచ్చరికలు కలరపాటుకుగురిచేస్తున్నారు. తక్షణమే కొత్త వాటితో భర్తీ చేయాలని కన్నయ్యనాయుడు చేసిన సూచనతో ఆందోళన రేకెత్తిస్తుంది. పదో నంబర్ గేటు నుంచి నీరు లీకవుతున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు ప్రాజెక్టుకు వచ్చే నష్టమేమిలేనప్పటికీ అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కన్నయ్యనాయుడు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంలో శ్రీశైలం ప్రాజెక్ట్ రేడియల్ క్రస్ట్ట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. పదో నంబర్ గేట్ నీటి లీకేజీ 10శాతం కంటే తక్కువగా ఉందన్నారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా మెయింటినెన్స్ ఉండాలన్న ఆయన., వాటికి పెయింటింగ్ వేయాలని సూచించారు. రానున్న ఐదేళ్ల కాలంలోపుగానే రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయని పక్షంలో మరో తుంగభద్ర పరిస్థితి తప్పదని హెచ్చరించారు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్పూల్ ఉందన్న విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళగా, దాని వల్ల శ్రీశైలం ఆనకట్ట పునాదులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు.
ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టును శంకుస్థాపన అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1963 జూలైలో చేశారు . 1964లో రూ.39.97 కోట్లు ఖర్చుఅవుతుందని అంచనావేయగా అది 1991 నాటికి రూ.567.27 కోట్లయింది. డ్యాము నిర్మాణంతోపాటు , క్రెస్టుగేట్ల ఏర్పటుతో 1984 డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయింది. 1985 జూన్ మాసంలో కురిసిన వర్షాలకు జలాశయం పూర్తిగా నీటితో నిండింది. 13 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులోకి 2009 అక్టోబరు 2న 25 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించడంతో ప్రాజెక్టు అధికారులు భయాందోళన చెందాల్సి వచ్చింది. ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి వచ్చిచేరింది. భారీ వరదనీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటిమట్టం కంటే 10 అడుగుల పై నుంచి నీరు ప్రవహించిన విషయం విధితమే.