ప్రజల మద్దతుతో అభివృద్ధే లక్ష్యంగా…రాజకీయాల్లో వాసంశెట్టి!

Vasamsetti Subhash : కోనసీమ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం రామచంద్రాపురం…ఇక్కడి రాజకీయాల్లో ఓయువకుడు అనూహ్యంగా ఎదిగి తనకంటూ ప్రత్యేకస్ధానం సంపదించాడు… ఎమ్మెల్యేగా గెలిచి, అపై మంత్రిపదవి దక్కించుకుని ప్రజలకు ఏదో చేయాలన్న తపన, మంచితనం, మాటతీరుతో ఎవరికి కష్టమొచ్చినా తానున్నాన్న భరోసానిస్తున్నాడు. చంద్రబాబు మార్గేనిర్ధేశంలో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ , ప్రణాళికా బద్ధంగా నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నాడు. ఇంతకీ ఈ మాటలన్నీ చెబుతుంది ఎవరి గురించి అనుకుంటున్నారా…ఆయనే కూటమి ప్రభుత్వంలో యువ మంత్రిగా గుర్తింపుతెచ్చుకన్న వాసం శెట్టి సుభాష్…కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అటు ఎమ్మెల్యేగా నియోజక వర్గానికి, మంత్రిగా రాష్ట్రానికి వాసం శెట్టి ఏంచేశారో తెలుసుకునే ప్రయత్నం ఈ కధనం ద్వారా తెలుసుకుందాం..

రామచంద్రాపురం రాజకీయాలే సపరేటు !

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం రాజకీయాలే సపరేటు. రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తైతే రామచంద్రాపురం రాజకీయాల తీరే సపరేటు. అలాంటి ఈ నియోజకవర్గం నుండి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు వాసం శెట్టి సుభాష్.. ఆ ఎన్నికల్లో కాకలు తీరిన రాజకీయ నేతలైన ఆనాటి వైసిపి మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల అభిమానాన్ని చూరగుని సార్వత్రిక ఎన్నికల్లో సుభాస్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ పై అత్యధిక మెజార్టీతో గెలుపొంది విజయదుందుబి మోగించాడు.

ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సామాజిక సమీకరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కన్ను వాసం శెట్టిపై పడింది. తన మంత్రి వర్గంలో చురుకైన యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న చంద్రబాబు వాసం శెట్టి సుభాష్ కు ఏకంగా అమాత్యపదవినే కట్టబెట్టారు. తొలినుండీ నిత్యం అట్టడుగు, కార్మిక వర్గాలకు చేరువులో ఉండేందుకు ఇష్టపడే సుభాష్ కు ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు సైతం ఏకంగా కార్మికశాఖను అప్పగించారు. కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత మంత్రి నారా లోకేష్ ల దిశ నిర్దేశంతో, రాజకీయ అనుభవం లేకపోయినా తనదైన శైలిలో కూటమి పాలనలో ప్రజలకు మేలుకలిగేలా తనవంతు కృషి చేస్తున్నాడు.

ఒకవైపు మంత్రిగా తన శాఖపై పట్టుపెంచుకుంటూ, మరోవైపు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించేందుకు సాయశక్తుగా శ్రమిస్తున్నాడు. పక్కా ప్రణాళికలతో నియోజకవర్గ అభివృద్ధికి ముందడుగు వేయటమే కాకుండా, మరోవైపు సమాంతరంగా సేవా దృక్పథంతో అనేక దాతృత్వ కార్యక్రమాలతో ప్రజల మన్ననలను మంత్రి సుభాష్ అందుకుంటున్నారు. నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి చూపేందుకు జాబ్ మేళాలు, అలాగే పేద,బడుగు వర్గాల ప్రజారోగ్యం కోసం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు కష్టం వస్తే తానున్నానని సంకేతాలు ఇస్తున్నారు మంత్రి సుభాష్.

రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అదిస్తున్న వాసంశెట్టి ;

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతోపాటుగా, వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పధకాలు ఒక పార్టీ మాత్రమే అందించే పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించేది. అయితే వాసం శెట్టి సుభాష్ మాత్రం రాజకీయాలకు అతీతంగా, తరతమభేదం లేకుండా అందరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

గత ఏడాది కాలంలో రామచంద్రపురం నియోజకవర్గంలో (Ramachandrapuram MLA) 246 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు, నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశారు. 116 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు పంపిణీ చేశారు. అలాగే 123 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 11.5 కోట్ల రూపాయలతో ద్రాక్షారామంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి కొత్త పారిశ్రామిక దిశకు కోనసీమలో నాంధి పలికారు వాసం శెట్టి. పార్టీలకతీతంగా సంక్షేమ అమలు చేస్తూనే, నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

నూతన పారిశ్రామిక అభివృద్ధి దిశగా కోనసీమ ;

మరోవైపు రాష్ట్ర మంత్రిగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన నూతన పారిశ్రామిక విప్లవంలో తన వంతుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు మంత్రి సుభాష్…ఉద్యోగం పొందటం కాదు..ఉద్యోగాలు సృష్టించే స్ధాయికి యువత ఎదగాలి అన్న ఆలోచనతో కోనసీమలో పరిశ్రమల ఏర్పాటు విప్లవానికి రామచంద్రాపురం నుండే నాంధిపలికారు. ప్రతి ఇంట్లో ఒకరు పారిశ్రామిక వేత్తగా ఎదగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన తీరుకు తగ్గట్టుగా దాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కుటుంబ ఆదాయం పెంచేలా ప్రభుత్వం చేపట్టిన పి4 విధానం రామచంద్రాపురంలో దిగ్విజయంగా అమలయ్యేలా ఎంతో మంది ఉన్నత వర్గాలకు చెందిన వారిని ప్రోత్సహిస్తూ పి4లో భాగస్తులను చేస్తున్నారు.

అభివృద్ధిలో రామచంద్రాపురం ముందడుగు ;

గత ఐదేళ్ళ వైసీపి పాలనలో రామచంద్రాపురం నియోజకవర్గంలో అరాచక పాలన నడిచింది. అదే క్రమంలో రాష్ట్రంలో ప్రగతి ప్రశ్నార్థకంగా మారింది…గత ప్రభుత్వంలో కుట్ర పూరితంగా భూములు వెనక్కి లాక్కోవడంతో పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలిపోయాయి… రామచంద్రాపురం నియోజకవర్గంలో 2014 – 19 మధ్య కూటమి పాలనలో పారిశ్రామికంగా ఎదిగేందుకు బీజాలు పడ్డాయి. అయితే గత వైసీపీ విధానాలు , వైఖరి కారణంగా నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకిగామారాయి. తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం రాష్ట్రంలో, ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో పారిశ్రామిక రంగం పురోభివృద్ధికి (Industrial growth in AP) అడుగులు పడుతున్నాయని మంత్రి వాసం శెట్టి సుభాష్ అంటున్నారు.

ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకొస్తామని మంత్రి సుభాష్ చెబుతున్నారు. 175 నియోజకవర్గాల్లో – MSME పార్కుల ఏర్పాటుతో ఉద్యోగ,ఉపాధి రాష్ట్ర కేంద్రంగా మార్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని, నీతి నిజాయితీతో, రాష్ట్రం కోసం పని చేసే పార్టీ కూటమి ప్రభుత్వమేనని ఆయన అంటున్నారు. చంద్రబాబు నిర్ణయాలతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మంత్రి సుభాష్ స్పష్టం చేస్తున్నారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగానే కాక ప్రజాసేవకునిగా, యువతకు మార్గనిర్ధేశకునిగా, నియోజకవర్గ అభివృద్ధిలో తన దైన ముద్రవేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కొత్త తరహా నేతగా నిలిచారని రామచంద్రాపురం ప్రజలు ప్రశంసిస్తున్నారు.

×