
ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మధుమేహం (డయాబెటిస్) సమస్యకు సరైన ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. తెల్ల బియ్యం, మైదా పదార్థాల బదులుగా జొన్న రొట్టె వంటి సంప్రదాయ ధాన్యాలను ఆహారంలో చేర్చడం రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జొన్న రొట్టె ఎందుకు మంచిది?
జొన్నలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగకుండా సహజంగా నియంత్రణలో ఉంటుంది. అలాగే జొన్నకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేందుకు దోహదపడుతుంది.
రోజూ తింటే ఏమౌతుంది?
జొన్న రొట్టె రోజూ తినడం మంచిదే అయినా, అది ఒక్కటే షుగర్ ను పూర్తిగా తగ్గించదు. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, వైద్యుల సూచనలు పాటించడం అవసరం.
నిపుణుల సూచనలు;
- రోజూ కనీసం 30 నిమిషాలు నడక చేయాలి
- కూరగాయలు, పప్పులు ఎక్కువగా తీసుకోవాలి
- స్వీట్లు, శీతల పానీయాలు తగ్గించాలి
- పరిమిత మోతాదులో జొన్న రొట్టెను ఆహారంలో చేర్చుకోవాలి
సంప్రదాయ ధాన్యాలను ఆహారంగా తీసుకోవటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. సరైన జీవనశైలితో పాటు జొన్న రొట్టెను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.