ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా డా. కాసుల నియామకం

హిందూ ధర్మ పరిరక్షణ పఠిష్దిత దిశగా ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ – దేవాదాయ ధర్మదాయ శాఖ స్టేట్ కోఆర్డినేటర్‌గా డాక్టర్ కాసుల కృష్ణం రాజును నియమిస్తూ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాస్ రావు గారు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ దాసరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, డా. కాసుల కృష్ణం రాజు గత అనేక సంవత్సరాలుగా హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయ సంప్రదాయాల సంరక్షణ, ధార్మిక సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రశంసించారు. వారి సేవాభావం, నాయకత్వ లక్షణాలు, ధార్మిక విలువల పట్ల నిబద్ధతను గుర్తించే ఈ బాధ్యత అప్పగించామని తెలిపారు.

డా. కాసుల కృష్ణం రాజు ఇప్పటివరకు పలు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ధార్మిక అవగాహన సదస్సులు, యువతలో సనాతన ధర్మంపై చైతన్యం పెంచే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. దేవాలయాల పరిరక్షణ, సంప్రదాయ ఉత్సవాల నిర్వహణ, హిందూ ధర్మ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయం.

ఈ నియామకం సందర్భంగా డా. కాసుల కృష్ణం రాజు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన ట్రస్ట్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం మరింత అంకితభావంతో పని చేస్తానని, దేవాదాయ ఆలయాల గౌరవం, సంప్రదాయాల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ నియామకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని, ట్రస్ట్ కార్యకలాపాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా చేరుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

×