
పాలోవర్స్, సబ్ స్ట్రైబర్స్, రేటింగ్ కోసం కంటెంట్ క్రియేటర్స్ విపరీత పోకడలు పోతున్నారు. దీని వల్ల ప్రజల ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా, వాస్తవ విరుద్ధమైన కంటెంట్ క్రియేట్ చేసి మంది మీదకు వదులు తున్నారు. కాలక్షేపానికి వాటిని చూసి నిజమేనని నమ్మి వారు కూడా అదే ఫాలో అవుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వాటి వల్ల లాభం మాట అటుంచితే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం చెప్పబోయేది తమిళనాడు చోటు చేసుకున్న ఘటన గురించి…పనికి మాలిన వీడియో చూసిన ఓ యువకుడు అది నిజమేనని నమ్మి అలాగే చేసి చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన శక్తీశ్వరన్ కు మంచి బాడీ షేప్ కావాలని ఎప్పటి నుండే కోరిక ఉండేది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వీడియోలు చూస్తూ బాడీ షేప్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. రోజువారిగా బాడీ షేప్ కోసం వ్యాయామాలు చేస్తున్నాడు. అంతటితో సరిపెడితే పర్వాలేదు ఒకడుకు ముందుకు వేసి అదే యూట్యూబ్ లో బాడీ షేప్ కోసం వారు చూసించిన ఓ ఫ్యూట్ జ్యూస్ తాగటం ప్రారంభించాడు. గత మూడు నెలలుగా యూట్యూబ్ వారు చెప్పిన విధంగా ఫ్రూట్ జ్యూస్ తాగటం ఫాలో అయ్యాడు.
అంతా బాగానే ఉన్నా సడన్ గా నిన్న జ్యూస్ త్రాగిన వెంటనే ఊపిరి ఆడక చనిపోయాడు. శక్తీశ్వరన్ ఆరోగ్యగంగా చాలా యాక్టివ్ గా ఉంటాడని ఎందుకు ఇలా అకస్మాత్తుగా చనిపోయాడో అర్ధం కావటం లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. అయితే ముందస్తుగా డైటీషీయన్ సలహాను తీసుకోకుండా యూట్యూబ్ లో చూపించే వీడియోలు చూస్తూ బాడీ షేప్ కోసం గత మూడు నెలలుగా ఫ్రూట్ జ్యూస్ తాగు తున్నాడని వారు భావిస్తున్నారు. ఇంట్లోనే అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం కుటుంబసభ్యులను షాక్ గురిచేసింది. వెంటనే శక్తీశ్వరన్ ను ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయిందని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
శక్తిశ్వర్ వయస్సు 17 ఏళ్లు..ప్రస్తుతం స్థానికంగానే ఇంటర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదువును పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ కళాశాలలో చేరడానికి దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ఈసమయంలో అతను చనిపోవడం అందరిని కలిచివేసింది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అధికమైపోయాయి. బరువు తగ్గాలని, స్లిమ్‌గా కనిపించాలన్న కోరికతో అడ్డమైన వీడియోలు చూసి వాటినే చాలా మంది అనుసరిస్తున్నారు. ఇలాంటి వాటి కారణంగా చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే ఇలాంటి వాటిని చేయాలి తప్పించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లు తుందని నిపుణులు అంటున్నారు.
గతంలో కేరళలో ఇలాంటి ఘటనే ;
2025 మార్చి మాసంలో కేరళలోని కన్నూర్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.18 ఏళ్ల శ్రీనంద అనే యువతి బరువు పెరగకూడదని భోజనాన్ని మానేసింది. మంచినీరు మాత్రమే తాగుతూ ఆహారం తీసుకోవటం పూర్తిగా మానేసింది. దీంతో ప్రాణాలు పోగొట్టుకుంది. ఆన్లైన్లోని వచ్చే చెత్త వీడియోలు , పోస్టులకు ప్రభావితమై తిండి మానేసింది. చివరకు ఆకలితో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ చనిపోయింది.
ముఖ్యంగా యువత టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు అందమైన శరీరాకృతి కోసం సామాజిక మాధ్యమాల్లో వచ్చే డైట్ ప్లాన్లకు ఆకర్షితులవుతున్నారు. ఆరోగ్య నిపుణులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫాంల్లో వచ్చే కంటెంట్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. నిపుణుల సూచనలు లేకుండా చేసే డైటింగ్ వల్ల ప్రమాదాలు కొనితెచ్చుకోవాల్సి ఉంటుంది. సురక్షితమైన, సమతుల్య ఆరోగ్య విధానాలను అనుసరించటం మంచిది.