
Rare Fruits for Monsoon : వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సమయంలో అందరిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంతో ముఖ్యం…రోగాలు దరిచేరకుండా ఒకవేళ అనారోగ్యం పాలైనా దానిని నుండి త్వరగా కోలుకునేందుకు శరీరానికి తగినంత ఇమ్మూనిటీ పవర్ అవసరం.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ సీజన్ లో మార్కెట్లో లభించే పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా సహజసిద్ధమైనవి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తీసుకోవటం వల్ల వర్షకాలంలో జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు.
వర్షాకాలంలో వాతావరంలో మార్పులు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో తినే ఆహారం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉండే వర్షకాలంలో బ్యాక్టీరియా, వైరస్ల బెడద అధికంగానే ఉంటుంది. వీటి వ్యాపి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతోపాటు అనేక శరీరక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సీజన్ లో లభించే కొన్ని రకాల పండ్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూడటంలో సహాయపడతాయి. వర్షాల సీజన్లో ఎలాంటి పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దం..
వర్షాకాలంలో తినాల్సిన పండ్లు ;
జామ పండ్లు : జామకాయ వర్షాకాలంలో తినడం మంచిది. తినటానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. జామకాయలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకుంటే ఆరోగ్య పరంగా మేలు కలుగుతుంది. జామలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడంలో ఎంతగానో సహాయపడతాయి.
ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి మేలు కలగిస్తాయి. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడాయి. అయితే పండ్లను మితంగా తీసుకోవాలి. అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
దానిమ్మ పండ్లు: ఎరుపు రంగులో ఉండే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటంలో దోహదం చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరంలోకి ఇన్ఫెక్షన్లు ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
రక్తహీనతతో బాధపడుతున్న వారు తింటే త్వరగా రక్తంపడుతుంది. రక్తపోటును తగ్గించడంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. దానిమ్మ పండ్లను గింజల రూపంలో తినవచ్చు. అలాగే జ్యూస్ గా చేసుకొని తాగవచ్చు.
ఆపిల్ పండ్లు : ఆపిల్ పండ్లు రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని తినేవారిలో వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
ఆపిల్స్ లో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచటంలో తోడ్పడతాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకం , బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పేర్కొన్నారు. అధిక రక్తపోటు నియంత్రణలో ఉండి , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు ప్రక్రియలలో ఆపిల్ ఎంతగానో ఉపకరిస్తుంది.
బొప్పాయి పండ్లు : అన్ని సీజన్లలో దొరుకుతుంది. బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలు ,యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. బొప్పాయిని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన పండ్లలో ఇది కూడా ఒకటని నిపుణులు సూచిస్తున్నారు.
దీనలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్నికాపాడుతుంది. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండి శరీరంలో ఎర్రరక్త కణాల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతుంది. తలనొప్పి, అలసట వంటి చికాకుల నుండి ఉపశమనం పొందవచ్చు.
బేరి పండ్లు : ఈ పండ్లు తియ్యగా, రుచిగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలం. జీర్ణక్రియకు, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అలాగే దీనిలో విటమిన్ సి,కె, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తినటం వల్ల కొన్ని జబ్బులు దరిచేరకుండా చూడవచ్చు.
దీనిలోని ఫైబర్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ఈపండ్లు తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఈ పండ్లలోని ఫ్లేవనాయిడ్లు మంటను తగ్గించి, టైప్ 2, స్ట్రోక్ ప్రమాదాన్ని నిరోధించటంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక ; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.