మొలకలు పచ్చివిగా తినొచ్చా? తింటే ఆరోగ్యానికి ప్రమాదమా?

raw vs cooked sprouts : ప్రతిరోజు ఉదయం మొలకలు (sprouts) తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలుకలుగుతుంది. మొలకల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌, యాంటి ఆక్సిడెంట్ల వంటి శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచటంలో ఎంతగానో దోహదపడతాయి. ఇటీవలి కాలంలో చాలా మంది మొలకలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన ఆహారంగా మొలకలను చెప్పవచ్చు.

మొలకల్లో ఉండే విటమిన్లు ,యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచటంలో సహాయపడతాయి. శక్తిని పెంచడానికి, అలాగే బరువు తగ్గటానికి మొలకలు చాలా మంది ఇష్టంగా తింటారు. మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ల వల్ల క్యాన్సర్ వంటి నయంకాని రోగాలు దరిచేరే అవకాశం ఉండదు.

మొలకలు పచ్చిగా తినటం వల్ల కలిగే నష్టాలు ;

మొలకలు వర్షాకాలంలో త్వరగా పాడైపోతాయి. రెండుమూడు రోజులు మొలకలను తినకుండా వదిలేస్తే ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్‌ వీటిపై పెరుగుతుంది. అలాంటి మొలకలను తిన్నారంటే లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మొలకలను పచ్చిగా తినడం కంటే ఉడకబెట్టి తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చల్లటి వాతావరణంలో ఉడికించినవి వేడివేడిగా తింటే నోటికీ మంచి రుచిగా కూడా ఉంటాయి.

మొలకల్ని ఉదయం సమయంలో తీసుకోవటం ఉత్తమం. సలాడ్ లలో, సూప్ లలో , ఇతర వంటకాలలో చేర్చుకుని మొలకల్ని తీసుకోవచ్చు. పచ్చి మొలకలు ఈ కొలీ, సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉండే ప్రమాదం ఉంటుంది. కావట్టి వాటిని ఉడకబెట్టుకుని , లేదంటే వేడి చేసుకుని తినటం ఉత్తమం. పచ్చి మొలకలు తింటే కొందరిలో అసిడిటీ సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి. మరికొందరు జీర్ణం కావటం కష్టంగా మారుతుంది. కావట్టి మొలకల్ని పచ్చిగా తినకుండా ఉడకబెట్టుకుని తినటం మంచిది.

×