పెరుగును పాల ఉత్పత్తిని గడ్డకట్టించటం ద్వారా తయారు చేస్తారు. పాలలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి. పెరుగులో కాల్షియం, విటమిన్ B-2, విటమిన్ B-12, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. పెరుగుతినటం వల్ల అద్భుతమైన ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగులో అధిక కాల్షియం ఉంటుంది. ఇది ఆమ్లత్వానికి మంచి గృహచికిత్స. ఇది శరీరంలో ఆమ్లాన్నినిరోధిస్తుంది. దీనిని రోజుకు ఒక గిన్నె తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల కొన్నినష్టాలు కూడా ఉన్నాయి.
పెరుగుతో ఉపయోగాలు ;

- జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగును రోజువారీగా తీసుకోవటం వల్ల కడుపులోని ఆమ్లస్ధాయిలు అదుపులో ఉంటాయి. పిహెచ్ స్ధాయిలను నియంత్రిస్తుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది.
- అధిక బరువుతో బాధపడుతున్న వారు పెరుగు తినటం వల్ల బరువు తగ్గంచుకోవచ్చు. ఇందులోని కాల్షియం ఉబకాయానికి వ్యతిరేకంగా తోడ్పడుతుంది.
- పెరుగు ఎముకల బలానికి ఉపకరిస్తుంది. దీనిలో ఉండే కాల్షియం, భాస్వరం ఎముకలకు మంచి శక్తిని ఇస్తాయి. దంతాలు, ఎముకల గట్టిగా ఉండాలంటే రోజువారిగా పెరుగుతినాలి.
- పెరుగు రోజువారిగా తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని ప్రోబయోటిక్ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగటానికి దోహదపడుతుంది.
పెరుగుతో నష్టాలు ;
1.పెరుగులో అధిక శాతం కొవ్వు ఉండటం వల్ల పెరుగుని మరీ ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
2.పెరుగులోని గెలాక్టోస్, ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించటంతోపాటు ఇందులోని గ్లూకోజ్, హైపర్గ్లైకేమియా, పండ్ల రసాన్ని తీసుకున్న తర్వాత శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, హైపర్గ్లైకేమియా వల్ల దీర్ఘకాలిక మంటకు , హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది.
3.పెరుగులో అధికంగా సంతృప్త కొవ్వులు, గ్లైకేషన్ ఉత్పత్తులు ఉంటాయి. పెరుగును అధికమొత్తంలో మొత్తంలో తీసుకుంటే ఇది ఎముకల సాంద్రతను దెబ్బతీసి కీళ్లనొప్పులకు దారితీస్తుంది.
4.పెరుగు శ్లేష్మ స్వావాన్ని పెంచటంతోపాటు, సైనస్, జలుబు, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నవారికి మరింత ఇబ్బంది కలిగిస్తుంది.