
Kota srinivasarao passes away : ప్రముఖ సినీ నటుడు,మాజీ శాసన సభ్యులు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాసరావు ఆదివారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. గత 40 ఏళ్ళుగా సినీ ప్రపంచంలో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించారు. 750కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన 9 నంది అవార్డులను అందుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకర్గ భాజపా ఎమ్మెల్యేగా 1999-2004 వరకు పనిచేశారు.
కోటా శ్రీనివాసరావు సీనిప్రస్ధానం ఇలా ;
కోట శ్రీనివాసరావు స్వస్ధలం కృష్ణా జిల్లా కంకిపాడు. తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసేవారు.1942, జులై 10న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. చిన్నవయస్సు నుండి కోటకు నాటకాలంటే ఎంతో ఆసక్తి . సినిమాలలో రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు. రుక్మిణితో 1966లో ఈయనకు వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన కుమారుడు కోట ప్రసాద్ జూన్ 21, 2010 లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
నటనలో కోటాకు అవార్డుల పంట ;
తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలలో కోటా శ్రీనివాసరావు నటించాడు. 1978 లో కోట శ్రీనివాసరావు ముఖ్యపాత్రదారునిగా ప్రాణం ఖరీదు అనే నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా, దర్శక నిర్మాత క్రాంతికుమార్ దానిని సినిమాగా తీయాలనుకున్నాడు. అలా కోట శ్రీనివాసరావు సీనిమా అరంగెట్రం చేశారు. విలన్ తోపాటు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి విభిన్న పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 2012లో వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో కోట నటనకుగాను SIIMA అవార్డు వరించింది. భారతీయ సినిమాకి కోట శ్రీనివాసరావు కృషికి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని లభించింది.
కోట తనయుడు ప్రసాద్ కూడా సినీరంగంలో అడుగుపెట్టి జె.డి.చక్రవర్తి దర్శకత్వంలోని సినిమా సిద్ధంలో నటించాడు. గాయం – 2 లో తన తండ్రితో పాటు యాక్ట్ చేశాడు. కోటశ్రీనివాసరావు తన సోదరుడు కోటశంకరరావును కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చాడు. పలు చిత్రాల్లో కోట సోదరుడు కూడా నటించారు.
అహనా పెళ్ళంట చిత్రం ద్వారా ఫేమస్ అయిన కోటా ;
పిసినిగొట్టు పాత్ర లో అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసి మంచినటునిగా పేరుతెచ్చుకన్నారు. యోగి సినిమాలో విలన్ గా నటించారు. వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖి సినిమాలో తాతగా నటించి అందరిని మెప్పించారు.

కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ తో అనేక సినిమాలు వచ్చాయి. వీరు కలసి నటించిన సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించేవారు. వీరు పండించే కామెడీ ప్రేక్షకులకు ఒక టానిక్ గా పనిచేసేది. అందుకే ఈ ఇద్దరిని కలిపి కోటా బ్రదర్స్ గా పిలిచేవారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లులో కోట శ్రీనివాసరావు విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆసినిమా విడుదల దగ్గరలో ఉన్న సమయంలో కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడవటం అందరిని విషాదంలో ముంచెత్తింది.