గిరిజన గ్రామాల అభివృద్ధి దిశగా అడుగులు…మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

Tribal community empowerment : స్త్రీ, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి నేడు “ఆదికర్మయోగి” కార్యక్రమంపై మాట్లాడుతు.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ₹8.80 లక్షలు మంజూరు చేసింది. ఒక్కో మాస్టర్ ట్రైనర్‌కు ₹5,500 చొప్పున సహాయం అందించాం. మొత్తం 40 మంది SMTలు శిక్షణ పొందుతున్నారు.

గిరిజనుల సశక్తీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆదికర్మయోగి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, వారి సమస్యలపై ప్రభుత్వంతో నేరుగా చర్చించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ప్రధానంగా గిరిజన గ్రామాల అభివృద్ధి దిశగా ప్రజల్లో చైతన్యం పొందేందుకు రూపొందించబడింది. ప్రజల సమస్యలు, అవసరాలు ప్రభుత్వానికి అందేలా చేసేందుకు, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఇది ముందడుగన్నారు.

మన లక్ష్యం 2047 నాటికి సమగ్ర అభివృద్ధి. అందుకు తగిన విధంగా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో మార్గదర్శక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మొదటిగా రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన 8 SMTల‌కు బెంగళూరులో శిక్షణ ఇచ్చాం. తరువాత వారు జిల్లాల ఎంపికైన అధికారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అలాగే మండల స్థాయిలో అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి వారి ద్వారా గ్రామస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇది ఒక శిక్షణా మాత్రమే కాదు,,ఇది ప్రజలలో నాయకత్వం, బాధ్యత, ప్రభుత్వంపై విశ్వాసం పెంపొందించే ఉద్యమం. గ్రామస్థాయిలో పనిచేస్తున్న AWWలు, ANMలు, SHG సభ్యులు, NGOలు ఇలా ప్రజలతో నిత్యం పనిచేసే వ్యక్తులందరికీ ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ అందించబడుతుందన్నారు. ‘ఆదికర్మయోగి’ అనేది ఒక ప్రజా చైతన్య ప్రక్రియ. ఇది ప్రతి గిరిజన గ్రామానికి మార్గనిర్దేశం చేయగల నాయకత్వాన్ని అందించే పథకం. మేము దీన్ని కేవలం శిక్షణల స్థాయిలో ఆపకుండ, నిజంగా గిరిజన ప్రజలు జీవనశైలిలో మార్పు తీసుకొచ్చేలా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

×