తండ్రిని మించిపోయాడు…సత్తా చాటుకుంటున్నాడు

అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో తండ్రికి మించిన తనయుడనిపించుకున్నాడు….ఎంతమంది తలపడినా అదరలేదు…బెదరలేదు….ఓడిన చోటే భారీ మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎవరైతే తనను రాజకీయాలకు పనికిరాడంటూ ఎగతాళి చేశారో వారినే రాజకీయాల్లో మట్టి కరిపించటమే కాదు,…జీరోలుగా మార్చేస్ధాయికి ఎదిగాడు. ఇంతకీ ఆయువనేతను ఢీకొట్టే సత్తా ప్రత్యర్థులకు ఉందా…ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయ చదరంగంలో ప్రత్యర్థుల రాజకీయ పునదులను పెకిళిస్తున్న వైనంపై ప్రత్యేక కధనం…

అదరకుండా,,, బెదరకుండా రాజకీయాల్లో ముందడుగు…

నారా లోకేష్…ఇప్పుడీ పేరు దేశంలోని యువ రాజకీయ నేతలందరిలో కెల్ల ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు తనయుడుగా…ఆయనకు రాజకీయ వారసుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోకి రాకముందే ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు పన్నారు. పప్పు అంటూ హెళనలు, అవమానకరమైన సెటర్లతో ఇబ్బంది పెట్టినా… ఎవరు ఎమన్నా, ఎన్ని విమర్శలు చేసినా అదరకుండా,,, బెదరకుండా రాజకీయాల్లో ముందుకు సాగుతూ ప్రజాభిమానం చూరగొన్న ప్రజానేతగా ఎదిగిన వైనం దేశ రాజకీయాల్లో తలపండిన పొలిటికల్ లీడర్లనే అశ్ఛర్యపోయేలా చేసింది.

సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోంటూ…

సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి చంద్రబాబు నాయుడు మాటల స్ఫూర్తితో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను లోకేష్ తన భుజానికి ఎత్తుకుని అనుకున్నది సాధించాడు. యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్రగా చెప్పుకోవాలి. ఈ యాత్రతో ప్రజలతో మమేకమైనతీరు, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించిన వైనంతో,… ఆరోజే లోకేష్ ప్రజానాయకుడున్న సంగతి తెలుగు ప్రజలకు అర్ధమైపోయింది. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వేటికి బెదరలేదు. నాయకత్వ పటిమ విషయంలోనే కాదు, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగే సత్తాకలిగిన లీడర్ గా లోకేష్ ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు పార్టీకి అన్నీ తానై ముందుండి నడిపిస్తూ క్యాడర్ కు దిశ నిర్దేశం చేయగలిగిన సమర్ధత కలిగిన నేతగా పేరు తెచ్చుకున్నారు. సొంత పార్టీనేతలేకాదు, ప్రత్యర్థి పార్టీ నేతలు సైతం లోకేష్ పనితీరును చూసి ప్రజానాయకుడుగా ఎదిగాడంటూ బాహాటంగానే చెబుతున్నారు.

ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో…

మూడు దశాబ్దాలుగా టీడీపీ గెలుపుకు దూరమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి 90వేలకు పైగా మెజార్టీతో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించటమే కాదు, క్యాబినేట్ లో బెర్తు దక్కించుకుని ఇప్పుడు మంత్రిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో స్ధానం సంపాదించుకుంటున్నాడు. నిరంతరం అనేక సమావేశాలు, అధికార పర్యటనలతో నిత్యం తీరిక లేకుండా గడిపుతూ ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేతగా అందరిమనన్నలు అందుకుంటున్నాడు లోకేష్…తండ్రి నుండి నేర్చుకున్న రాజకీయ పాఠాలతో ఒకవైపు ప్రత్యర్థులకు చుక్కులు చూపిస్తూనే మరోవైపు, తండ్రి పాలనాదక్షతను పునికి పుచ్చుకుని అధికారిక వ్యవహారాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు.

తండ్రికి మించిన తనయుడిగా…

జగన్ రాజకీయ కుట్రలను ఎదుర్కోవటంలో లోకేష్ వ్యవహరిస్తున్న తీరు చూసి చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియనే మెచ్చుకుంటున్నారంటే మామూలు విషయం కాదు….అదే సమయంలో ఏపి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తూ, తన సమర్థత, కార్యదక్షతతో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలను, దిగ్గజ పరిశ్రమలను, వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తూ… ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో అహర్నిశలు లోకేష్ శ్రమిస్తున్నాడు. పార్టీకి సంబంధించిన బరువు బాధ్యతలను తనే మోస్తూ తండ్రిపై ఒత్తిడిని తగ్గించి… పార్టీ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపే స్థాయికి చేరాడు…ఒకవైపు మంత్రిగా జనంలోకి వెళ్తూ.. మరోవైపు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రత్యర్థుల విమర్శలకు ధీటైన సమాధానం ఇస్తూ తండ్రికి తగ్గతనయుడుగా ముందుకు సాగుతున్నాడు…

ప్రత్యర్థులను మట్టికరిపించటమే లక్ష్క్ష్యంగా…

నిన్నటికి నిన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత గడ్డ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో లోకేష్ సత్తా ఏంటో తెలిసేలా చేశాడు. నారా లోకేష్ కొట్టిన దెబ్బకు పులివెందులలో వైయస్ పొలిటికల్ కోట బీటలు వారింది. పులివెందులలో తమకు ఎదురులేదని ఎన్నో ఎళ్ళుగా కాలర్ ఎగరేసిన వారిని చివరకు మట్టికరిచేలా చేయటం ద్వారా తెలుగుదేశం జండా పులివెందులలో రెపరెపలాడేలా చేశాడు లోకేష్…వైయస్ ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యాన్ని పులివెందుల జెడ్ పీటీసీ ఎన్నికలతో కూకటివేళ్ళతో పెకిలించివేసి తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్ధితి వచ్చిందంటే పులివెందుల రాజకీయాలను లోకేష్ ఎంతగా ప్రభావితం చేశాడో అర్ధం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పులివెందుల జెడ్ పీటీసీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిని లతారెడ్డి గెలుపు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రస్ధానం పతనం అంచుకు చేరుకుందనటానికి నిదర్శనంగా నిలుస్తుందని రాజకీయపండితులు అభివర్ణిస్తున్నారు…

పాలనపై పట్టు…

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నారా లోకేష్ పాలనాపరమైన అంశాలపై దృష్టిసారించారు. ప్రజల సంక్షేమం కోసం ఏం కావాలో, ఏంచేస్తే బాగుంటుందో తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సూచనలు ఇచ్చేస్ధాయికి ఎదిగాడని ఆయన్ను దగ్గరగా చూసిన వారంతా చెబుతున్నారు.. లోకేశ్‌ ఇప్పుడు రాజకీయాల్లో రాటుదేలారు..పరిణతి చెందిన నేతగానే కాదు, ఆత్మవిశ్వాసం ఆయనలో తొణికిసలాడుతుంది. ఇదే ఒరవడితో లోకేష్ రాజకీయ ప్రయాణం కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు మారటమేకాదు, ప్రత్యర్ధి పార్టీలు కనుమరుగు కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.

×