
Wedding Season Shravanmasam : పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ఒక ప్రత్యేకమైన, పవిత్రమైన బంధం..జీవితాంతం కలిసి ఉంటానికి వారి మధ్య చేసుకునే ఓ ఒప్పంద వేడుక. సాంస్కృతికంగా ఆచార పరంగా దీనిని వేడుకగా నిర్వహిస్తారు. ఈ పెళ్ళి తంతు జరిపించేందుకు మన పెద్దలు మంచి రోజుల్లో మంచి ముహుర్తం నిర్ణయిస్తుంటారు. వేదపండితులు సూచన మేరకు పెళ్ళి తంతు జరుగుతుంది. గత కొద్ది మాసాలుగా పెళ్ళి ముహుర్తాలు లేకపోవటంతో చాలా జంటలకు ఒక్కటయ్యే యోగం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం మరికొద్ది రోజుల్లోనే శ్రావణమాసం ఘడియలు రానున్నాయి. దీంతో పెళ్ళి భాజాలు తిరిగి మొగబోతున్నాయి.
పెళ్లిలకు శ్రావణమాసం ముహుర్తాలు మంచిదని మన తెలుగు వారు నమ్ముతారు. అందుకే శ్రావణ మాసంలో ఏకమయ్యేందుకు చాలా జంటలు ఎదురు చూస్తున్నాయి. పెళ్లి భాజాలు, డోలు సన్నాయి శ్రావణమాసమంతా మోగనున్నాయి.శుభ ముహూర్తాల ప్రకారం కల్యాణ మండపాలకు అడ్వాన్సులు చెల్లిస్తూ ముందే బుక్ చేసుకుంటున్నారు. వివాహాలేకాదు, గృహ ప్రవేశాలు, ఇంటి శంఖుస్ధాపనులు, మంచి పనులు ఏమి చేయాలన్న శ్రావణమాసం మంచిదని పండితులు శలవిస్తున్నారు.
ఎంతో మందికి ఉపాధి చూపే శ్రావణమాసం ;
పెళ్ళంటే ఇద్దరు జంటలను కలపటమేకాదు ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలిగిస్తుంది. పురోహితులకు, ఈవెంట్ ఆర్గనైజర్లకు ,క్యాటరింగ్, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాల, అలంకరణ, రవాణా యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు, డీజేలు, టెంట్‌హౌస్‌లకు వారికి శ్రావణమాసం మేలు కలిగించనుంది.
శ్రావణమాసంలో మంచి ముహర్త తేదీలు ;
జులై 26, 31 తేదీలు, ఆగస్టు 9న వందలాది వివాహాలు జరగనున్నాయి. గృహ ప్రవేశాలకు ఈ నెల 30 తో పాటు ఆగస్టు 3, 9 తేదీల్ల్లో మంచి ముహూర్తాలున్నాయి.
రానున్న నెలల్లో మంచి ముహుర్తాలు ఇవే ;
జులైలో 26, 30, 31,
ఆగస్టు మాసంలో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17,
సెప్టెంబరులో 24, 26, 27, 28,
అక్టోబరు మాసంలో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31,
నవంబరు 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30