ఏపికి మరో ఎయిమ్స్ కావాలి ; మంత్రి సత్యకుమార్

బిహార్, జమ్మూ కశ్మీర్ లో మాదిరిగా మరో ఎయిమ్స్ ను ఏపీకి మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ అన్నారు. అయితే వెనుబడిన రాష్ట్రాలైనందున మరో ఎయిమ్స్ ను కేటాయించలేమని, మరో ప్రత్యేక పథకం కింద ఏపీకి గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నడపడం అందరికీ ఆమోదయోగ్యమని మంత్రి సత్యకుమార్ తెలిపారు. దురుద్దేశంతో దీనిపై విషప్రచారం చేస్తున్నారన్నారు. దీన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.

సిఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలవల్ల గడచిన 19 నెలల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ, ఐపీ, ల్యాబ్ టెస్టులు పెరిగాయన్నారు. జీవితంలో వినోదం భాగమే కానీ, వినోదమే జీవితం కాదని విద్యార్థులకు హితవు పలికారు. ఎయిమ్స్ ఇవ్వాల్సిన 10 ఎకరాలను త్వరలోనే కేటాయిస్తామన్నారు. గత ప్రభుత్వం aimsku కనీస నీటి సదుపాయాన్ని కల్పించలేకపోయిందని మంత్రి శ్రీ సత్యకుమార్ మండిపడ్డారు

×