బావి తరాల భవిష్యత్ గురించి ఆలోచించే విజనరీ మన చంద్రబాబు నాయుడు

రేపల్లె, జనవరి 24 : ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం జిల్లాలో నిర్వహించే స్వర్ణ ఆంధ్ర – స్వచ్చంద్ర కార్యక్రమంలో బాగంగా 4 వ శనివారం ఉదయం బాపట్ల జిల్లా,రేపల్లె మండలం కేంద్రం నందు ఏ బి ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందునిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, బిసి సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు జిల్లా ప్రత్యేక అధికారి మల్లిఖార్జున,బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తో కలసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా ఉంచాలని ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆంద్రప్రదేశ్ ను స్వచ్చంద్ర ఉంచాలని ఉద్దేశంతో 2025 జనవరి నుండి రాష్ట్రములో ప్రతినెల మూడో శనివారమును స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఒకచోట స్వచ్చంద్ర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. బావి తరాల భవిష్యత్ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడుని, రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రహిత ఆంద్రప్రదేశ్ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం సృష్టించడం జరిగిందని తెలిపారు.రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు చేయడం కూటమి ప్రభుత్వము ముఖ్య ఉద్దేశమని తెలిపారు, కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారంగా పెన్షన్లు పెంచడం జరిగిందని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని, డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని, పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రేపల్లె నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక యం పి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఆములు పరచడం జరిగిందని అప్పుడు ఈ కార్యక్రమాని ఇతర రాష్ట్రాల్లో కూడా అములు చేయడం జరిగిందని తెలిపారు. ప్లాస్టిక్, ఇనుము, హాస్పిటల్ నుంచి వచ్చే వేస్టేజ్ వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు, వేస్టేజ్ వల్ల ఆదాయం వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రములో స్వచ్ఛ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వేస్టేజ్ని వివిధ రకాలుగా ఉపయోగించి ఆదాయం వచ్చే విదంగా ముఖ్యమంత్రి ఆలోచించారని తెలిపారు. పంచాయతీ రాజ్,రూరల్ డెవలప్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ స్వచ్ఛ రథాల ద్వారా చెత్త, వేస్టేజ్ ని సేకరించే సమయంలో ప్రజలు రోజు వారి ఉపయోగించుకొని వస్తువులను కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. రేపల్లె నుండి తెనాలి వరకు రెండో వ రైల్వే లైన్ నిర్మాణానికి, రేపల్లె నుండి బాపట్ల వరకు నాలుగు లైన్ రోడ్డు నిర్మాణా పనులకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకు రావడానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రేపల్లె నియోజకవర్గం పరిధిలో ఉన్న బౌద్ధ స్తూపం పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి, వివిధ దేశాల నుండి వచ్చే బౌద్ధ మతస్థులు కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రూ. 20 కోట్లు నిధులు మంజూరు కు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపడం జరిగిందని తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో అన్ని విధాలుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ప్రతి నెల3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ కొత్త సంవత్సరం లో జీరో గ్యాస్ శానిటేషన్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.ఈ ప్రాంతంలో ఉన్న వేస్టేజిని కాల్వల లో వేయడం వల్ల అంత సముద్రము నీటిలో కలుస్తుందని దీనివల్ల చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇబ్బంది కలిగించడం తో పాటుగా సముద్ర ప్రాంతాలను కలుషితం జరుగుతుందని, జిల్లాకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర పరిశుభ్రత నిర్వహణపై అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుల ను మంత్రి, ఎంపీ,ప్రత్యేక అధికారి,కలెక్టర్ చేతులమీదుగా కార్మికులను ఘనంగా సన్మానించారు. మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మరియు బాల్య వివాహాల పై నిర్వహించి పోటీలలో గెలుపొందిన బాలికలకు బహుమతులు,మరియు ఆడపిల్లలను కనిన తల్లులకు మొక్కలను మంత్రి అందజేశారు. అంతకుముందు స్వర్ణద్ర- స్వచ్చంద్ర కార్యక్రమంలో బాగంగా రేపల్లె మండల కేంద్రం రామలక్ష్మి థియేటర్ రోడ్డు నుండి ఏ బి ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం డిగ్రీ కళాశాల ఆవరణలో మంత్రి, ఎంపీ,ప్రత్యేక అధికారి కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోయడం జరిగింది.కళాశాల ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన స్వచ్ఛ రథాలను మంత్రి ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కట్ట మంగమ్మ, రేపల్లె మండలం ఆర్డీఒ యన్.రామలక్ష్మి, డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ, డ్వామా పి డి.విజయలక్ష్మి, డి పి ఓ.బి సి సంక్షేమ శాఖ డి డి శివలీలా,డి ఆర్డీఏ పి డి.సింగయ్య,సి పి ఓ.ఏ.ఎస్.రాజు,మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు,ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజలు,కళాశాలలు పాఠశాలలకు చెందిన బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.

×