ఏపి రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాన్ ను రెండవ దశ పూలింగ్ జరిగే గ్రామాలకు విస్తరించడంతోపాటు, ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్దమౌతుంది. పూర్తిస్థాయి ప్రణాళిక తయారు చేయడానికి రూపొందించిన నోట్లో ఇదే విషయాన్ని స్పష్టంగా తెలిపారు. అమరావతి రాజధాని నగర మాస్టర్ ప్లానును రెండోదశలో 20,494 ఎకరాలకు విస్తరింనున్నారు. అలాగే దానికి అనుసంధానంగా 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలు కలిపి సుమారు ఒక లక్షా 77 వేల ఎకరాలకు నిర్మాణ ప్రణాళికను రూపొందించాలని ఈ నోట్లో స్పష్టతనిచ్చారు.
ఇప్పటికే తొలి దశలో సమీకరించిన 53 వేల ఎకరాలతో కలిపి కొత్తగా విస్తరించదానితో కలిపి 2.30 లక్షల ఎకరాలకు మాస్టర్ ప్లాన్ చేరుతుంది. అయితే, రెండవ విడతకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ నోట్లో ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను రూపొందిస్తోంది. ఇటీవల రెండోదశ పూలింగు ప్రారంభం సందర్భంగా మంత్రి నారాయణ తూర్పున జాతీయ రహదారి, ఉత్తరాన కృష్ణానది, పశ్చిమాన ఔటర్రింగురోడ్డు వరకూ మాస్టర్ ను విస్తరిస్తామన్నారు. దీనిలో భాగంగానే సిఆర్డిఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
రాజధానిని అభివృద్ధి చేయడం, పూర్తి చేయడంతోపాటు ఆర్థికాభివృద్ధికి వీలుగా అనుబంధ నగరాలను మాస్టర్లోను పరిధిలో ఏర్పాటు కోసం అదనపు భూమికి ప్లాను విస్తరించడం అవసరమని ప్రతిపాదించారు. ప్లాను తయారీ, ఫైనాన్స్, అమలు అనే మూడు పద్దతుల్లోఉండబోనుంది. ప్రస్తుతానికి కొత్తగా తీసుకున్న ఏడు గ్రామాలకు గతంలో ఉన్న రాజధాని ప్లానును విస్తరిస్తారు. దీనికోసం 43 గ్రామాల పరిధిలోని ఏర్పాటు చేసే ప్రాంతీయ ప్లానును కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల భూ యజమానులు తిరిగి పొందే ప్లాట్లకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది.

కొత్తగా ఏర్పాటు చేసే మాస్టర్ ప్లాన్ ను ఏడు గ్రామాల పరిధిలోని 82.9 చదరపు కిలోమీటర్లను కలుపుకుని మొత్తం 709.6 చదరపు కిలోమీటర్లకు చేరనుంది. గుంటూరు సమీపంలోని డోకిపర్రు నుండి మొదలుకుని పెదకూరపాడు మండలంలో తాళ్లూరు గ్రామం, పెదకాకాని మండలంలో వేజెండ్ల, మంగళగిరి మండలంలో కాజ గ్రామం వరకూ మొత్తం ప్రాంతాన్ని మాస్టర్లను పరిధిలో చేరనుంది. ఆరునెలల్లో రెండుదశల్లో దీన్న సిఆర్డిఎ అవసరాల మేరకు విస్తరించడంతోపాటు అవసరమైతే అదనపు గ్రామాలకు ప్లానును పెంచేలా రూపకల్పన చేస్తారు.
తొలి రెండు నెలల్లో ఏడు గ్రామాల్లో మాస్టర్లను తయారీకి వీలుగా అన్ని రకాల సర్వేలు పూర్తి చేయడంతోపాటు గ్రీన్, బ్లూ ప్లాను రూపకల్పన చేస్తారు. ఇన్నర్ రింగురోడ్డు, ఔటర్రింగురోడ్డుకు వీలుగా రవాణా సదుపాయం ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే రైలు మార్గాన్ని అనుసంధానిస్తారు. రెండోదశ పూలింగు సమగ్ర ప్లానుతోపాటు మిగిలిన 43 గ్రామాల నిర్మాణ ప్రణాళికకు సంబంధించి గుంటూరు జిల్లాలో ఈ 29 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 14 గ్రామాలు ఉండనున్నాయి.