
విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి 40శాతం పనులకు టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే మెట్రో రైల్ కార్పోరేషన్ ఈ ప్రక్రియను పూర్తి చేసింది..విజయవాడ,వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ ల వ్యయం రూ. 21 వేల 616 కోట్ల కానుంది..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేరో 50 శాతం చోప్పున నిధులు భరించనున్నారు..రాష్ట్ర ప్రభుత్వం వైజగ్ మెట్రో కోసం విశాఖ పట్నం మెట్రోపాలిటన్ రిజియన్ డవలప్మెంట్ అధారిటీ నుండి రూ. 4101 కోట్ల నిధులు మళ్లించనుంది..ఇదే క్రమంలో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం సీఆర్డిఏ నుండి 3497 కోట్ల నిధులను మళ్లించనున్నారు..
విజయవాడ,విశాఖ పట్నం నగరాలు రూపురేఖలు త్వరలో మారనున్నాయి..ఈ రెండు నగరాల ప్రజల ఎంతో కాలంగా ఎదురుచూస్తు మెట్రో రైలు ప్రాజెక్ట్ లు త్వరలో పట్టాలెక్కనున్నాయి..ఇందులో భాగంగా రేపు ఈ రెండు ప్రాజెక్ట్ ల టెండర్ల ను ప్రభుత్వం అధికారికంగా పిలవనుంది..ఏపి సిఎం చంద్రబాబు ఈ రెండు నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లోను మెట్రోరైల్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు..ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వంతో దీనిపై చర్చలు జరిపారు..ఇదే సమయంలో ఢిల్లీ మెట్రో రైల్ చైర్మన్ ను కూడా కలిసిన సిఎం చంద్రబాబు ఈ రెండు ప్రాజెక్ట్ ల నిర్మాణం పై చర్చించారు.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేస్ ఒన్ లో భాగంగా మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ 10 వేల 118 కోట్ల గా అంచనా వేశారు.. రేపు దీనికి టెండర్లు పిలవ నుంది. ..ఈ మొత్తం వ్యయాన్ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేరి సగం భరించనున్నాయి..దీనిలో భాగంగా ఏపి ప్రభుత్వం తన వాటా కింద సీఆర్డీఏ నుండి రూ.3497 కోట్ల నిధులను మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు కేటాయించనున్నారు.. అయితే తొలి ఫేస్ లో భాగంగా 38 కిలోమీటర్ల మేర రెండు కారిడార్ల తో మెట్రోరైల్ నిర్మాణం చేపట్టనున్నారు. పండిట్ నేహ్రూ బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకు ఒక కారిడార్..అలాగే రెండో కారిడార్ కింద నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు వరకు మొత్తం 33 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి..
వైజాగ్ నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ వ్యయం రూ.11 వేల 498 కోట్ల తో తొలి ఫేస్ పనులకు రేపు టెండర్లు పిలవనున్నారు..ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా విఎంఆర్డీఎ నుండి 4101 కోట్లు కేటాయించనున్నారు. తొలి ఫేస్ లో భాగంగా మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర నిర్మాణపనులు చేపట్టనున్నారు. మొదటి కారిడార్ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు అలాగే రెండవ కారిడార్ గురుద్వార్ నుండి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు , మూడవ కారిడార్ తాడిచెట్ల పాలెం నుండి చినవాల్తేరు వరకు మొత్తం 42 మెట్రో స్టేషషన్లు ఉండనున్నాయి.
విశాఖ, విజవాడ మెట్రో ప్రాజెక్టులతో రెండు నగరాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అలాగే పర్యావరణ హితంగా ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్ధ సమకూరనుంది. ఉద్యోగ అవకాశాల కల్పనతోపాటు, రెండు నగరాల అభివృద్ధికి మెట్రో రైల్ ప్రాజెక్టులు దోహదం చేయనున్నాయి.