భలే బ్యాటరీ సైకిల్…సిద్ధూతో కలసి సైకిల్ పై పవన్ కళ్యాణ్

*వినూత్న ఆవిష్కరణకు ఉప ముఖ్యమంత్రి అభినందనలు

*రూ. లక్ష ప్రోత్సాహకం అందజేత

PAWANKALYAN: తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించాడు విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధు. ఈ మధ్యకాలంలో సిద్దూ రూపొందించిన బ్యాటరీ సైకిల్ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్దూ సరికొత్త ఆవిష్కరణ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న డిప్యూటీ సియం , సైకిల్ తో సహా సిద్దూను మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించారు.

సిద్దూ తయారుచేసిన సైకిల్‌ను పవన్‌ కల్యాణ్‌ స్వయంగా నడిపారు. సైకిల్ వెనుక బాగంలో సిద్దూను కూర్చో బెట్టుకుని డిప్యూటీ సియం హోదాలో సైకిల్ నడపటం అందరిని ఆశ్ఛర్యపరిచింది. సిద్దూ ఆలోచనలను పవన్ మెచ్చుకున్నారు. అలాగే సిద్దూ రూపొందించిన ‘గ్రాసరీ గురూ వాట్సాప్‌ సర్వీస్‌’ బ్రోచర్‌ను చూసి ప్రత్యేకంగా అభినందించారు.

ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని లక్ష రూపాయల ఆర్ధిక ప్రోత్సాహాన్ని సిద్దూకు అందజేశారు. విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేసుకున్నాడు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగలగే సామర్ధ్యం ఈ సైకిల్ సొంతమని సిద్దూ చెబుతున్నాడు.

×