
AP Cabinet Meeting : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపి కేబినెట్ భేటీ జరిగింది. మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస భవనాలు పూర్తి చేసేందుకు రూ.524 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూములు కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ చేసిన తీర్మానాలకు ఆమోద ముద్ర పడింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
క్యాబినెట్ బేటీలో తీసుకున్న నిర్ణయాలు

- అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం
2.రాజధానిలో రెండో విడత భూ సమీకరణ అవసరాలను ప్రజలకు వివరించి, రైతుల అనుమానాలు నివృత్తి చేసి ఒప్పుకున్నాకే భూ సమీకరణ చేయాలని నిర్ణయం.
- అమరావతిలో 6 కేంద్ర సంస్థలకు 33.49 ఎకరాల కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం. అలాగే రాజధానిలో 7 సంస్థలకు కొత్తగా 32.4 ఎకరాలు కేటాయింపు… గెయిల్, అంబికా సంస్థలకు కేటాయించిన భూమి రద్దు ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదం.
4.అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
5.గత ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో రద్దు చేసిన 1,575 పింఛన్ల పునరుద్ధరణకు ఆమోద ముద్ర
- అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం..తద్వారా రూ.4000ల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశాభావం.
- ఏపీ స్పేస్ పాలసీ 2025-2030కు గ్రీన్ సిగ్నల్…తద్వారా స్పేస్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు
8.నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు సరిహద్దుల విస్తరణతో పాటు అదనంగా 790 ఎకరాల సేకరణకు కేబినెట్ ఆమోద ముద్ర
- రామాయపట్నంలో కొత్త పరిశ్రమలు వచ్చేందుకు భూసేకరణ… ఇందుకోసం 5 బృందాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో విమానాశ్రయాల అభివృద్ధికి హడ్కో నుంచి వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రిమండలి అంగీకారం…ఎయిర్‌పోర్టుల లీజుకు ఇవ్వటం ద్వారా వచ్చే ఆదాయంతో అప్పు తీర్చాలని నిర్ణయం
- రైతులకు దాన్యం సేకరణ డబ్బు చెల్లించేందుకు రూ.672 కోట్లు విడుదల… నగదును 24 గంటల్లో వారి ఖాతాల్లో వేయాలని అదేశాలు. అదేవిధంగా ఆరున్నర లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు రూ.260 కోట్లు విడుదలకు మంత్రివర్గం సమ్మతి
- సరకు రవాణా వాహనాలపై విధించిన గ్రీన్ టాక్స్‌ను రూ.1500 నుంచి రూ.3000ల వరకూ తగ్గించాలని నిర్ణయం.
- జలజీవన్ మిషన్ వాటర్ సప్లై పేరిట ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు..దానికి గాను రూ.10,00ల కోట్ల రుణ సమీకరణకు ఆమోదం
- మార్క్ ఫెడ్ నుంచి మరో వెయ్యి కోట్లు తీసుకునేందుకు కేబినెట్ అంగీకారం…
- జగన్ ప్రభుత్వ పాలనలో వైఎస్సార్సీపీ నేతలు నడిరోడ్డుపై గొంతుకోసి చంపిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం..